జర్నలిస్టుల పట్ల ప్రభుత్వాలు పగ పట్టినట్లుగా ఉంది.
కొత్త సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టకపోగా వున్న వాటిని కుదిస్తూ.. రద్దు చేస్తూ జర్నలిస్టులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇప్పటికే అక్రెడిటేషన్ కార్డులు అందరికీ సరిగా రాక ఆందోళన చెందుతున్న జర్నలిస్టులపై ఆర్టీసీ ప్రయాణంలో తగ్గింపులు చేస్తూ సమాచార పౌరసంబంధాల శాఖ దొడ్డి దారిన మరో నిబంధన ఉత్తర్వు జారీచేసింది. ఈ చర్యను తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది. నియోజకవర్గం, మండల అక్రెడిటేషన్ కార్డులకు బస్సు ప్రయాణంలో తగ్గింపులు చేస్తూ జారీ చేసిన ఈ ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.
మామిడి సోమయ్య, రాష్ట్ర అధ్యక్షుడు,
బి. బసవపున్నయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, TWJF.