జాతీయ లోక్ అదాలత్ లో మణుగూరు కోర్టులో 1121 కేసుల పరిష్కారం…
భద్రాచలం కోర్టులో 1943 కేసుల పరిష్కారం…. ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రీట్ యం. వెంకటేశ్వర్లు….
మణుగూరు, సెప్టెంబర్ 09 (మహానది ప్రతినిధి): జాతీయ న్యాయసేవా సాధికార సంస్థ ఆదేశాల మేరకు శనివారం నాడు జుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టు, మణుగూరు నందు లోక్ అదాలత్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముందుగా బ్యాంకు అఫీసర్లకు సదస్సు నిర్వహించారు. అనంతరం: మెజిస్ట్రేట్ యం. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ… రాజీ మార్గమే రాజమార్గమనీ, లోక్ అదాలత్ ద్వారా కేసులు త్వరితగతిన పరిష్కారమవుతాయని, తద్వార కక్షిదారులకు సమయం, ధనం ఆదా అవుతాయని అన్నారు. సుప్రీం కోర్టు అదేశాల మేరకు ప్రతి రెండు నెలలకు ఒకసారి లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. ప్రజలకు సత్వర న్యాయం అందించేందుకు న్యాయశాఖ కృషి చేస్తున్నదని, ఇందులో భాగంగానే లోక్ అదాలతలు నిర్వహించి కేసులను పరిష్కరిస్తున్నదని తెలిపారు. రాజీ ద్వారా పరిష్కారానికి అవకాశం ఉన్న కేసులను లోక్ అదాలత్లో పరిష్కరించుకోని ప్రశాంతంగా జీవించాలని కక్షిదారులకు సూచించారు. కోర్టు కేసుల పెండింగ్ సమస్యకు లోక్ అదాలత్ పరిష్కారమని అన్నారు. లోక్ అదాలత్ లో ఇచ్చే అవార్డునకు అప్పీల్ ఉండదని తెలిపారు. శనివారం నాడు జుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టు, మణుగూరు నందు. అన్ని రకాల కేసులు కలిపి 1121 పరిష్కారమైనట్లు తెలిపారు. ఇందులో సిసి రాజీపడిన కేసులు 37, సీసీ అడ్మిషన్ కేసులు 86, యస్.టి.సి. కేసులు 992, డివిసి కేసులు 2, మనోవర్తి కేసులు 2, చెక్కు కేసులు 2 కాగా సిసి కేసులలో జరిమానా వసూళ్ళు రూ. 1,50,400/-, బ్యాంకు పియల్.సి కేసులలో వసూళ్ళు రూ. 9,09,66/-, సమ్మరీ ట్రయల్ కేసులలో జరిమానా వసూళ్ళు రూ.1.05,760/-, మొత్తం కలిపి రాజీ కేసులు 1121 పరిష్కారమైనట్లు మెజిస్ట్రేట్ యం. వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రస్తుతం జుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టు, భద్రాచలం కోర్టుకు ఇంచార్జీ గా వ్యవహరిస్తున్న మణుగూరు జడ్జి వెంకటేశ్వర్లు భద్రాచలం కోర్టు నందు అన్ని రకాల కేసులు కలిపి 1943 పరిష్కారమైనట్లు తెలిపారు. ఇందులో సిసి రాజీపడిన కేసులు 31, సిసి అడ్మిషన్ కేసులు 138, యస్.టి.సి. కేసులు 1769, డివిసి కేసులు 1, మనోవర్తి కేసులు 2, చెక్కు కేసులు 2 కాగా సిసి కేసులలో జరిమానా వసూళ్ళు రూ.3,12,660/-, బ్యాంకు పియల్.సి కేసులలో వసూళ్ళు రూ.2,24,390/-, ఎక్సయిజ్ కేసులలో జరిమానా వసూళ్ళు రూ. 10,000/-, మొత్తం కలిపి రాజీ కేసులు 1943 పరిష్కారమైనట్లు మెజిస్ట్రేట్ యం. వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మణుగూరు డియస్పీ రాఘవేంద్ర, ఎపిపి సాంబా దుర్గాబాయ్, మణుగూరు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మేదరమెట్ల శ్రీనివాసరావు, వైస్ ప్రెసిడెంట్ చిర్రా సరస్వతి, లేడి రిప్రజెంటేటివ్ నిమ్మనగోటి సావిత్రి, ఉచిత న్యాయసహాయ న్యాయవాది అంకం సర్వేశ్వర రావు, న్యాయవాదులు ఏ
రామ్మోహన్ రావు, కామునిపల్లి నగేష్ కుమార్, జాడి తొక్కయ్య, బిక్కసాని శ్రీనివాస రావు, దాసరి కవిత, సూర్యం, పోశం భాస్కర్, వాసవి, సిబ్బంది మహతి, రేఖ, పి, ప్రవళిక, కోర్టు కానిస్టేబుల్స్ మురారి, శ్రీను, కిశోర్ తదితరులు పాల్గొన్నారు.


