-మహానది వెబ్ న్యూస్ ,  హైదరాబాద్, సోమవారం:11/11/2024

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్యపై తప్పుడు ఆరోపణలతో బ్రోచర్ క్రియేట్ చేసి, సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు సైబర్ క్రైం డీసీపీ కవిత గారిని సోమవారం కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు డీసీపీకి వినతి పత్రం అందజేశారు.  ఫెడరేషన్ నాయకులు మాట్లాడుతూ, జర్నలిస్టులపై ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేయడం పూర్తిగా అన్యాయమని, దీనివల్ల వారి వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతింటుందని తెలిపారు. జర్నలిస్టులకు మద్దతుగా, ఈ అక్రమ ప్రచారాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

 

0Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *