♦ బీసీలకు న్యాయం చేయడంలో రేవంత్ రెడ్డి విఫలం

♦ ఓట్లు మావే రాబోయే రోజుల్లో రాజ్యాధికారం మాదే

♦ ఎల్బీనగర్ చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి నిప్పుపెట్టిన TRP నాయకులు

♦ ఎల్బీనగర్ చౌరస్తాలో బొడ్డుపల్లి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నిరసన

 ఎల్బీనగర్, మహానది న్యూస్: ఎన్నో దశాబ్దాలుగా ఈ దేశంలో రాష్ట్రంలో బీసీలు వెనకబడిపోయారని, రాష్ట్రంలో మెజార్టీ ప్రజలైన బీసీలు రాజ్యాధికారానికి దూరంగా ఉన్నారని, బీసీలకు రాజ్యాధికారమే ధ్యేయంగా, బీసీలను చట్టసభలకు పంపించడమే కోసమే తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఏర్పాటు చేసారని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుదగాని హరి శంకర్ గౌడ్, వట్టే జానయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంగం సూర్యరావు, రాష్ట్ర నాయకులు బందారపు నర్సయ్య గౌడ్ తెలిపారు.

తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు తీన్మార్ మల్లన్న పిలుపు మేరకు ఈరోజు ఎల్బీనగర్ లో రాష్ట్ర యువ నాయకుడు బొడ్డుపల్లి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం ఎల్బీనగర్ చౌరస్తాలో నిర్వహించడం జరిగింది. తొలుత చౌరస్తాలో బైఠాయించి అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ఉన్న పేపర్లను తగలబెట్టి , రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ తక్షణమే రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలంటూ రోడ్డుపై బైఠాయించారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి బీసీలకు 42% రిజర్వేషన్ తేవడంలో పూర్తిగా విఫలమయ్యాడని, ఆయన తెచ్చినటువంటి ఏదైతే జీవో ఉందో ఆ జీవో నాలుక గీసుకోవడానికి కూడా పనికిరాదని గతంలోనే మల్లన్న చెప్పడం జరిగిందని, అది నేడు అక్షర సత్యం అయిందని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీలను మోసం చేసేందుకు ఈ 42 శాతం రిజర్వేషన్ ను తప్పుల తడకతో తీసుకువచ్చారని దీని కేవలం బీసిలను మభ్య పెట్టడం కోసమే ఇది జరిగిందని ఆరోపించారు. రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే జీవో 9 ను సవరణలు చేసి బీసీలకు విద్య, ఉద్యోగాలలో అదేవిధంగా రాజకీయ పార్టీలలో సముచిత స్థానం దక్కే విధంగా కృషి చేయాలని హితవు పలికారు. హైకోర్టు తీర్పు రేవంత్ రెడ్డి కి ఒక చెంపపెట్టు లాంటిదని అన్నారు.  రాబోయే కాలంలో ఓట్లు మావే, సీట్లు కూడా మావే అవుతాయని జోష్యం చెప్పారు. 2028 లో రాబోయే శాసనసభకు జరగబోయే ఎన్నికల్లో తెలంగాణ రాజ్యాధికారం పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో రాష్ట్ర యువ నాయకులు లింగం యాదవ్,  బొంగు వెంకటేష్ గౌడ్, కిరణ్ ముదిరాజు, పాకాల నరసింహ, ఖమ్మంపాటి రమేష్, రూపాని రాజా, కోట్ల వసుదేవ్, మహమ్మద్ ఖదీర్, జన మౌని అంజన్ కుమార్ యాదవ్ తదితర నాయకులు పాల్గొన్నారు.

0Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *