జూబ్లీహిల్స్, మహానది : జన్మదిన వేడుకలను ఆడంబరంగా జరుపుకోవడం వదిలి అవసరం ఉన్న పేదలకు,ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్న వారికి సహాయం చేసే దిశగా ప్రయత్నం చేయాలని సంపంగి గ్రూప్ సీఈఓ సురేష్ సంపంగి అన్నారు. జూబ్లీహిల్స్ లోని సంపంగి కార్యాలయంలో మేనేజింగ్ డైరెక్టర్ సంపంగి రమేష్ జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా సీఈఓ సురేష్ సంపంగి మాట్లాడుతూ ప్రతీ సంవత్సరం ఎండి జన్మదిన వేడుకలను నిరాడంబరంగా జరుపుకుంటున్నారని అన్నారు. ఈ సంవత్సరం 100 మందికి రక్తదానం శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దానితోపాటు వివిధ హాస్పిటల్లలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

0Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *