సిద్దిపేట, మహానది :

ఆర్. వి యం ఇన్స్టిట్యూట్ ఆవిర్భవించిన పదకొండు సంవత్సరాలలో ఎన్ ఎస్ ఎస్ పరేడ్ వేడుకలకు తెలంగాణ నుండి ఎన్నికైన ఏకైక వైద్య విద్యార్థి భీమ్ భరత్ అని కళాశాల చైర్మన్ డాక్టర్ యాకయ్య పేర్కొన్నారు.

ఢిల్లీ లో జరిగే ఎన్ ఎస్ ఎస్ తరపున గణతంత్ర వేడుకలలో మార్చ్ ఫాస్ట్ లో పాల్గొంటాడని కాళోజీ నారాయణ రావు వైద్య విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ డాక్టర్ రమేష్ రెడ్డి తెలిపారు.ఆర్. వి.యం వైద్య కళాశాల యాజమాన్యాని, సిబ్బంది, విద్యార్థిని అభినందించారు. ఈ సందర్భంగా ఎన్ ఎస్ ఎస్ ఆఫీసర్ డాక్టర్ వెంకటేశ్వరరావు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ పరేడుకు ఎన్నిక కావడం ద్వారా దేశ రాష్టప్రతి, దేశ ప్రధానమంత్రి మొదలగు ప్రముఖ ముఖ్య నాయకులను కలిసే అద్భుత అవకాశం విద్యార్థికి లభిస్తుంది. గుజరాత్ రాష్ట్రంలోని పటాన్ జిల్లాలో హేమచంద్ర నారాయణ నార్త్ స్టేట్ గుజరాత్ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన వివిధ దశల స్క్రినింగ్ ఎదుర్కొని ఆల్ ఇండియా సెలక్షన్లో ప్రధమ స్థానం రావడం జరిగిందని అభిందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రాజేందర్, డీన్ శ్రావణ్ కుమార్, డైరెక్టర్ డాక్టర్ గోపికృష్ణ, సిఈఓ దేవరకొండ శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు.

0Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *