మహానది న్యూస్, కల్వకుర్తి :

– నిబంధనలు ఉల్లంఘించిన జూనియర్ లైన్మెన్ శివ
– అతడిని సస్పెండ్ చేయాలంటూ ఏఈకి ఫిర్యాదు
– డిసెంబర్ 30 న (TGSPDCL)SE ఆఫీస్ ముందు ధర్నా

గుండూర్ గ్రామ జూనియర్ లైన్మెన్ శివ ప్రోటోకాల్ పాటించకుండా గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఐమాక్స్ లైట్లు ప్రారంభించడంతో గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 29 లోపు కల్వకుర్తి ఏఈ అతనిపై చర్యలు తీసుకోకపోతే ఈ నెల 30 న నాగర్ కర్నూల్ (TGSPDCL) SE కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తామని గుండూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నంబి శంకర్ హెచ్చరించారు.
కల్వకుర్తి మండలం గుండూర్ గ్రామంలో గత నవంబర్ నెలలో కల్వకుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి రెండు హైమాస్లైట్ల ఏర్పాటుకు నిధులను మంజూరు చేయడం జరిగింది. ఈ లైట్లు జనవరి మొదటి వారంలో  ప్రోటోకాల్ ప్రకారం  ఎమ్మెల్యే, ఎంపీలు గ్రామ సర్పంచ్ తో కలిసి ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇంతలోనే జేఎల్ఎం శివ, అతని అనుచరుడు తుప్పల సత్యనారాయణతో ప్రారంభించడం జరిగింది. ప్రోటోకాల్ పాటించకుండా హైమాస్ట్ లైట్లను ప్రారంభించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నంబి శంకర్ డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఈనెల 30న జిల్లా విద్యుత్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని తెలిపారు.

0Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *