- బీసీ కుల, చేతి వృత్తులకు ఆర్థిక సహాయం
- ఈనెల 20 లోగా దరఖాస్తు చేసుకోవాలి
- కలెక్టర్ అనుదీప్ సూచన.
మహానది న్యూస్, మణుగూరు,బీసి కుల, చేతి వృత్తుల వారు ఆర్థిక సహాయం కోసం జూన్ 20 లోపు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం బీసీ కుల వృత్తులు, చేతి వృత్తుల వారికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించిందని, కుటుంబంలో ఒకరికి మాత్రమే గ్రాంట్ ఇవ్వబడుతుందని చెప్పారు. బిసి కులవృత్తులు, చేతివృత్తులు చేసుకునే వారు https://tsobmmsbc.cgg.gov.in ఆన్లైన్ లో ఈ నెల 20 లోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయం 18 నుంచి 55 సంవత్సరాల మధ్య వయస్కులై ఉండాలని, వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల వారికి ఒక లక్షా 50 వేలు, పట్టణ ప్రాంతాల వారికి 2 లక్షలు ఉండాలని అన్నారు. దరఖాస్తు తేదీ నుండి గత ఐదు సంవత్సరాల వరకు ఇప్పటికే వివిధ సంక్షేమ పథకాలు క్రింద రూ.50 వేలు అంతకంటే ఎక్కువ పొందిన లబ్ధిదారులు అనర్హులని తెలిపారు. బీసి కులవృత్తులు, చేతి వృత్తుల ఆర్థిక సహాయం కోసం అర్హత కల్గిన లబ్దిదారులు ఆన్ లైన్ లో కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు, ఆహార భద్రత కార్డు, పాస్ ఫోటో, బ్యాంకు పాస్ బుక్ జత చేస్తూ జూన్ 20 లోపు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు.