న్యాయ విజ్ఞాన సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి| ఇంచార్జ్ మెజిస్ట్రేట్ యం. వెంకటేశ్వర్లు
మహానది న్యూస్,మణుగూరు,ఆగష్టు 8 ,వెబ్ మీడియా ప్రజలందరికీ న్యాయ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువస్తున్న న్యాయ విజ్ఞాన సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని భద్రాచలం ఇంచార్జ్ జుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు యం. వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం నాడు కోర్టు ప్రాంగణంలో న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర న్యాయ శాఖ ఆదేశాల మేరకు ప్రతీ పేదవాడికి న్యాయ వ్యవస్థను అందుబాటులోకి తేవడానికి న్యాయ విజ్ఞాన సదస్సులను నిర్వహిస్తున్నామని తెలిపారు. న్యాయ వ్యవస్థను ఉచితంగా వినియోగించుకునేలా ప్రత్యేక న్యాయవాదిని సైతం నియమించామని తెలిపారు. చట్టాలపై అవగాహన కల్పిస్తూ ప్రజలను చైతన్య పరుస్తున్నామని పేర్కొన్నారు కోర్టు కేసుల పెండింగ్ సమస్యకు లోక్ అదాలత్ పరిష్కారమని అన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో యువత మత్తు పదార్దాలకు బానిసై గంజాయి స్మగ్లింగ్ కేసులలో జైలుకు వెళ్తున్నారని అన్నారు. అనంతరం చట్టాలు వాటి విలువ, వీటి ద్వారా జరిగే ఉపయోగాల గురించి మాట్లాడారు. సమాజంలో ప్రతి ఒక్కరూ చదువుకోవాలని, చదువుకుంటునే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏపిపి దుర్గాభాయ్, బార్ ప్రెసిడెంట్ కోటా దేవదానం, కోర్టు సిబ్బంది, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.