వరద సహాయక చర్యలు భేష్ జిల్లా యంత్రాంగాన్ని అభినందించిన యునిసెఫ్, eficor బృందసభ్యులు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : వరద సహాయక చర్యలు పరిశీలనకు శనివారం భద్రాచలం వచ్చిన యునిసెఫ్, EFICOR ఆరుగురు సభ్యులు సబ్ కలెక్టర్ కార్యాలయం, భద్రాచలంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ ని కలిశారు. ఈ సందర్భంగా బృంద సభ్యులు వరదల వల్ల ప్రజలకు వ్యాదులు ప్రబల కుండా ముంపునకు గురైన గ్రామాలలో పరిశుభ్రత పారిశుధ్య కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టారని అభినందించారు. వరద ప్రభావిత గ్రామాలలో ప్రజలకు పరిశుభ్రత కిట్‌లను అందిస్తామని చెప్పారు. వరద ప్రభావిత గ్రామాలలో పనికిరాని మరుగుదొడ్ల పునర్నిర్మాణాన్ని చేపట్టాలని చెప్పారు. వరద ప్రభావిత గ్రామాలలో ప్రజలకు సౌకర్యాలు కల్పనలో సహకారం అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో యూనిసెఫ్ బృంద సభ్యులు వెంకటేష్ అరళికట్టి, జయంత ఛటర్జీ, డా.ప్రభాత్ మట్పాడి, సీనియర్ వాష్ కన్సల్టెంట్ హర్షన్ KY జోనల్, EFICOR సభ్యులు కాళేశ్వర రావు, కణితి ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు.