- క్రీడలు అభివృద్ధికి రాష్ట్ర సర్కార్ పెద్దపీట
- క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు ప్రధానం చేసిన… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల కేంద్రంలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని కొమరం భీమ్ యూత్ నిర్వహించిన 3వ మండల స్థాయి జరిగిన క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు నిలిచిన వారికి బహుమతుల ప్రధానోత్సవం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు & భద్రాద్రి కొత్తగూడెం జిల్లా BRS పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు హాజరై య్యారు అదేవిధంగా రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 15వేల రూపాయల నగదును విజేతలకు అందజేశారు,
ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ
రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ క్రీడాకారులల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు రాష్ట్ర సర్కార్ పెద్ద పీట వేస్తున్నదని అన్నారు, గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలన్నారు, గెలిచినప్పుడు పొంగిపోకుండా ఓడినప్పుడు కుంగిపోకుండా యువత ప్రతిదానిని స్వీకరించి తమ తమ రంగాలలో ఉన్నత శిఖరాలను అవరోధించాలని యువత పెడదారి పడకుండా క్రీడలలో పాల్గొనడం వలన శరీరం దృఢంగా ఉంది శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉంటారని అన్నారు, ఇలాంటి క్రీడలు ఎప్పుడు గ్రామంలో జరిగిన వాటికి నా ప్రోత్సాహం ఎప్పుడు ఉంటుందని ఆయన అన్నారు, క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబరిచి మన ప్రాంత గ్రామానికి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు, ప్రతి ఒక్కరు క్రీడాకారులకు అండగా నిలవాలని వారిలోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలని కోరారు.