• నేటి నుండి ప్రీమియరీ ఎక్స్ ఫ్లో జివ్స్ కార్మికుల నిరవధిక సమ్మె.
  • పనిచేసే కార్యాలయం ముందు నిరసన ధర్నా
  • యాజమాన్యం మొండి వైఖరి, కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి.
  • :ఆర్.లక్ష్మీనారాయణ(ఏఐటీయూసీ రాష్ట్ర సమితి సభ్యులు) డిమాండ్.

పినపాక నియోజక వర్గం, 24 జనవరి, 2023 (మహానది ప్రతినిది):  మణుగూరు ప్రీమియర్ ఎక్స్ క్లూజివ్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ,  ఆధ్వర్యంలో  ఎక్స్ ప్లో జివ్  కార్మికులు నేటి నుండి నిరవధిక సమ్మెకు కార్యాలయం ముందు దిగారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర సమితి సభ్యులు ఆర్ లక్ష్మీనారాయణ కార్మికుల పక్షాన నిలబడి వారికి సంపూర్ణ మద్దతు తెలియజేశారు. మంగళవారం నుండి ఉదయం 7 గంటలకు కార్యాలయం ముందు కార్మికులు నిరవధిక సమ్మెకు దిగడంతో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆర్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, గత రెండు సంవత్సరాలుగా కార్మికులకు వేతన ఒప్పందం అమలు చేయకుండా యాజమాన్యం కాలయాపన చేస్తూ, కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతుందని అన్నారు. ఏఐటీయుసి నాయకత్వాన అనేకసార్లు యాజమాన్యం దృష్టికి సమస్యను తీసుకెళ్లినప్పటికీ ఏమాత్రం స్పందించడం లేదని వారి కనీస అవసరాలు కూడా తీర్చడం లేదని అన్నారు. 1, నవంబర్ 2022 న యాజమాన్యానికి కార్మికులు సమ్మె నోటీసు ఇవ్వడం జరిగిందని, వీటితోపాటు అధికారులకు, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, లేబర్ కమిషనర్ దృష్టికి సమస్యను తీసుకెళ్లినట్లు ఆయన వివరించారు. యాజమాన్యం కార్మికులతో 30 సంవత్సరాల నుండి వెట్టి చాకిరి చేయిస్తుందని, సమస్యల గురించి మాట్లాడితే పట్టించుకోవడంలేదని, అందుకే కార్మికులు విసుకు చెంది సమ్మెకు దిగాల్సి వచ్చిందని అన్నారు. ఇకనైనా యాజమాన్యం దిగివచ్చి కార్మికులతో చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించాలని, లేనిపక్షంలో ఏఐటియుసి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్థామని ఆయన హెచ్చరించారు. ఈ ఆందోళన కార్యక్రమంలో ఏఐటియుసి మండల అధ్యక్షలు తోట రమేష్, కార్యదర్శి అక్కి నరసింహారావు, జిల్లా సమితి సభ్యులు యస్.కె. సర్వర్, సొందే కుటుంబరావు, మంగి వీరయ్య కార్మికులు ఎర్రయ్య, యాకయ్య, బుచ్చి రాములు, అశోక్, బాబురావు, నరసింహారావు, మాధవరావు, బాబురావు, కార్మికులు పాల్గొన్నారు.

0Shares

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *