- జాతీయ మహాసభలో అరుదైన గౌరవం దక్కించుకున్న డా జమాల్ ఖాన్
- * ఆయుర్వేదంలో అష్టదిగ్గజం డా జమాల్ ఖాన్
- * పాముకాటుకు ఉచిత వైద్యంపై ప్రశంశలు
భద్రాద్రి కొత్తగూడెం : ట్రెడిషనల్ హీలర్స్ 3వ జాతీయ మహాసభలు తిరుపతిలోని ఎస్వీ యూనవర్సిటీలో పారంపర్య వైద్య మాహా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు ఆర్గనైజింగ్ కమిటీ శైవ క్షేత్ర పీఠాధిపతులు శివ స్వామిజీ, ఎస్వీ యూనివ్సిటీ వైస్ ఛాన్సలర్ కె రాజారెడ్డి మాట్లడుతూ
ఆపదలో ఉన్నవారికి అపన్నహస్తం అందించి అక్కున చేర్చుకోవడం ఆయన నైజమని, వంశపారంపర్యంగా తాను నేర్చుకున్న వనమూలికల వైద్యాన్ని పదిమందికి నేర్పాలని, అడవులలో దొరికే అరుదైన ఔషధ మొక్కలను కాపాడి భావితరాలకు అందించాలనే సదుద్దేశ్యంతో వనమూలికా వైద్యుడు హకీమ్ జమాల్ ఖాన్ నిత్యం తపన పడుతాడని కొనియాడారు. ఈ మహాసభలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎంపి గురుమూర్తి, ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ… ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయుర్వేదంలో అష్టదిగ్గజమైన వనమూలికా వైద్యుడు డాక్టర్ జమాల్ ఖాన్ తన వైద్యంతో మొండి జబ్బుల నుండి ఎందరికో విముక్తి కలిగిస్తూ పాముకాటికి గురై మృత్యు ఒడిలోకి జారిన ఎందరికో ప్రాణదానం చేసిన ఈ ఆయుర్వేద వైద్యుడు డాక్టర్ జమాల్ ఖాన్ ఆంద్రప్రదేశ్, తెలంగాణ, చత్తీస్గడ్, ఒరిస్సా, మహారాష్ట్ర, ప్రజలకే కాకుండా దేశ విదేశ ప్రజలకు సుపరిచితుడని, వనమూలికలతో అరుదైన వైద్యం చేయటం ఆయన ప్రత్యేకతన్నారు. పారంపర్య వైద్య మహా సంగం చైర్మన్ చంద్రశేఖర్ రాజు మాట్లాడుతూ… నిత్యం అడవులలో దొరికే ఔషదాలపై అధ్యయనం చేస్తూ ఆయుర్వేద పుస్తకాల పఠనం చేస్తూ సహజ సిద్ధంగా లభించే ప్రకృతిలోని వనమూలికల ద్వారా వివిధ జబ్బులకు మందులు తయారు చేస్తూ ఎందరికో వైద్య సేవలు అందించే ఈయన నిరుపేదలను ఆదుకుంటూ సేవభావాన్ని చాటుకుంటాడని. పాముకాటుకు గురై మృత్యువులోకి చేరుతున్న వారిని డాక్టర్ జమాల్ ఖాన్ దగ్గరికి చేరిస్తే చాలు వాళ్ళు మృత్యువును జయించినట్లేనని, పైసా పీజు లేకుండా రాష్ట్రాల వ్యాప్తంగా పాముకాటుకు గురైన వారిని కాపాడుకోవడం కోసం గ్రామానికొక యువకిడికి శిక్షణ ఇచ్చి పాముకాటు మరణాలు లేకుండా చెయ్యాలనే లక్ష్యంగా ముందుకెళ్తున్నాడని ఆయుర్వేదంలో దిట్ట అయిన డాక్టర్ జమాల్ ఖాన్ కోసం ఎంత చెప్పినా తక్కువేనని గర్వంగా చెప్పుకోవాలన్నారు. ఎస్వి యూనివర్సిటీ చైర్మన్ సావిత్రమ్మ మాట్లడుతూ… ఒరిస్సా రాష్ట్రంలోని మల్కనగిరి జిల్లా మోటుకు గ్రామానికి చెందిన డాక్టర్ జమాల్ ఖాన్ తన తాత,తండ్రి ద్వారా వారసత్వంగా ఆయుర్వేద వైద్యాన్ని ఈ రాష్ట్రాల ప్రజలకు అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్నాడన్నారు. అంతేకాక వివిధ యూనివర్సిటీలకు చెందిన ప్రొఫెసర్లు ఆయుర్వేద ఔషధాలపై పరిశోధకులు డాక్టర్ జమాల్ ఖాన్ వద్దకు వచ్చి వెళ్తుంటారని వివరించారు. ముఖ్యంగా కిడ్నీ, లివర్, క్యాన్సర్, బ్రెయిన్ ట్యూమర్, షుగర్, ఎముకలు విరగడం, కీళ్ల నొప్పులు, చర్మ వ్యాధులు, కామెర్లు, మొలలు, టీబీ, ఉబ్బసం, దగ్గు, వంటి దీర్ఘకాలిక వ్యాధులకు ఆడివిలో లభించే ఔషధ మొక్కలు, వనమూలికలు సేకరించి తనదైన శైలిలో వైద్య సేవలందిస్తూ ప్రజల మన్ననలు పొంది అందరికి ఆప్తుడిగా మారాడని డాక్టర్ జమాల్ ఖాన్ వైద్యసేవలను ప్రశంసించారు