• మహా శక్తిగా మాదిగల ఐక్యవేదిక
  • రాజకీయాలకు దీటుగా మాదిగల ఐక్యత..
  • ఫిబ్రవరిలో 10 వేల మంది తో ఆత్మీయ సమ్మేళనం..

పినపాక నియోజకవర్గం మాదిగల ఐక్యవేదిక మణుగూరు కేంద్రంగా సోమవారం కార్యాలయం ప్రారంభించారు. ఈ సందర్భంగా పినపాక నియోజవర్గంలోని ఏడు మండలాల మాదిగలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. మణుగూరు అంబేద్కర్ సెంటర్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి మొదటిగా పాలాభిషేకం చేసి పూలమాలతో నివాళులర్పించారు. అనంతరం నియోజకవర్గ వ్యాప్తంగా వచ్చిన మాదిగ సోదరులందరూ జై భీమ్ నినాదాలతో నియోజకవర్గ ప్రాంతీయ కార్యాలయానికి చేరుకొని మాదిగ ఐక్యవేదికల ప్రాంతీయ కార్యాలయాన్ని ముఖ్యఅతిథిగా కుర్రి రాజేశ్వరరావు చేతుల మీదుగా, ఉద్యోగుల సంఘం కార్యాలయాన్ని ప్రముఖ జర్నలిస్టు మాచర్ల శ్రీను, యువ న్యాయవాది గద్దల సాంబశివరావు చేతుల మీదుగా ప్రారంబించారు. అనంతరం మాదిగ ఐక్య వేదిక నియోజక వర్గ ప్రధాన కార్యదర్శి గద్దల నాగేశ్వరరావు అధ్యక్షతన మాదిగ ఐక్యవేదిక పినపాక నియోజకవర్గ అధ్యక్షులు రావులపల్లి రామ్మూర్తి మాట్లాడుతూ… నియోజకవర్గ మాదిగల అభ్యున్నతికి రాజకీయంగా ఆర్థికంగా ఎదగడానికి మాదిగలందరూ ఐక్యంగా ముందుకు వెళ్లాలని ఆయన అన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా 35 వేల మంది మాదిగలు ఉన్న అతిపెద్ద సామాజిక వర్గం మాదిగ సామాజిక వర్గం అని, రాజకీయాలను శాసించాల్సిన మాదిగలు దేహి అని అడుక్కోవడం అత్యంత బాధాకరమని అన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా మండలాల కమిటీలు ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. మాదిగల ఐక్యతే ఐక్యవేదిక ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు. ఫిబ్రవరిలో మాదిగ సమ్మేళనం ఏర్పాటు చేసి సురక్ష బస్టాండ్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు పది వేల మందితో భారీ ర్యాలీ నిర్వహిస్తామని ఆయన తెలిపారు. నియోజక వర్గ మాదిగలు అందరూ కలిసి మణుగూరు ప్రాంతంలో మాదిగల ఐక్యవేదిక కార్యాలయాన్ని ప్రారంభించడం మాదిగల ఐక్యతకు నిదర్శనమని అన్నారు. రానున్న రోజుల్లో మాదిగలను మహాశక్తిగా తయారు చేసి, మా హక్కులను మేమే సాధించుకుంటామని, ఒకరి దగ్గర దేహీ అని అడిగే పరిస్థితిలో లేమని ఆయన తెలిపారు. ఐక్యవేదిక ద్వారా ప్రతి మాదిగ కుటుంబాన్ని మాదిగ జాతిని రక్షించుకొని ముందుకు సాగుతూ వారి అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేస్తామని ఆయన అన్నారు. అంబేద్కర్ వారసులుగా అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా రాజకీయంగా ఆర్థికంగా అసమానతలు పోగొట్టే విధంగా సమాజంలో పేరుకుపోయిన అంటరానితన నిర్మూలనే లక్ష్యంగా మాదిగల ఐక్యవేదిక ముందుకు సాగుతుందని తెలిపారు. ఈ సమావేశానికి నియోజకవర్గ వ్యాప్తంగా ఏడు మండలాల నుండి తరలివచ్చిన మాదిగ జాతి మహనీయులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. మాదిగలం అందరం ఐక్యంగా ముందుకు వెళ్లి మన ఆశయాలను సాధించాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజక వర్గ న్యాయ సలహాదారు గద్దల సంబశివరావు, ఉపాధ్యక్షుడు ఇసంపల్లి కృష్ణ,ట్రెజరర్ నల్లగట్ల రఘు, మీడియా సెల్ ఇంచార్జ్, సిద్దెల తిరుమల రావు, సహాయ కార్యదర్శి పొడుతూరి విక్రమ్, గొల్లపల్లి నరేష్, లింగంపల్లి రమేష్, ఐటీసీ ఉద్యోగులు కేసుపాక నరసింహారావు, మిరియాల నరసింహారావు, ఇస్రం శ్రీను, రాజబాబు, అవులూరి రమేష్, అశోక్, మీడియా విభాగం తోకల మోహన్ రావు, కోడారి వెంకటేశ్వర్లు, ఇల్లందుల సురేష్, పొడుతూరి ప్రసాద్, నైనారపు నాగేశ్వరరావు, సుధీర్, మందపాటి రాజు, నాయుకులు కలగూర శంకర్, కుమార్ స్వామి, గంగాధర్, పాపారావు, మహేష్, నాగరాజు, శివ, కాటూరి రాము, బీసీ సంఘం నాయుకులు రుద్ర నాగరాజు, సీపీఐ నాయుకులు సొందే కుటుంబరావు, నరేష్, తదితరులు పాల్గొన్నారు.

0Shares

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *