-
-
దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్:
-
పినపాక నియోజక వర్గం, ఫిబ్రవరి, 7- 2023 (మహానది ప్రతినిది): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ,మణుగూరు మండలం. గత కొంతకాలంగా మణుగూరు, పాల్వంచ సూర్యపేట, ప్రాంతాల్లో దొంగతనాలు చేస్తున్న తురపాటి ప్రసాద్, వీ.యం. బంజర ,అనే వ్యక్తిని మణుగూరు డిఎస్పి రాఘవేందర్రావు ఆధ్వర్యంలో సిసిఎస్ ఇన్స్పెక్టర్ సీఐ వేణు చందర్రావు, ఎస్సై సురేష్, మరియు మణుగూరు సీఐ ముత్యం రమేష్, ఎస్సై రాజ్ కుమార్, పురుషోత్తo, కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు నమ్మదగిన సమాచారంతో,ఈరోజు మణుగూరులో పట్టుకోవడం జరిగింది అతని వద్ద నుండి ప్రస్తుతానికి రెండు తులాల వెండి, రెండు తులాల బంగారు వస్తువులు రికవరీ చేయడం జరిగింది.వీటితోపాటు పాల్వంచ, సూర్యాపేట పరిధిలో చేసిన దొంగతనం బంగారపు వస్తువులను త్వరలోనే రికవరీ చేయడం జరుగుతుంది.ఈ వ్యక్తిపై వ్యక్తిపై ఖమ్మం సూర్యాపేట వరంగల్ హసన్పర్తి పాల్వంచ మణుగూరు ఏరియాలలో సుమారు 30 వరకు దొంగతనం కేసులు ఉండగా గతంలో హసన్పర్తి పోలీసు వారు మరియు కాజీపేట పోలీసు వారు ఇతనిపై PD యాక్ట్ పెట్టి జైలుకు పంపించడం జరిగింది.జైలు నుండి బయటకు వచ్చాక మళ్లీ పళ్ళు దొంగతనాలు చేస్తూ ఈరోజు మణుగూరు పోలీసులకు పట్టు పడ్డాడు.