• విద్యుత్ ఉద్యోగులకు PRC ని వెంటనే ప్రకటించాలి

మహానది ప్రతినిది( మణుగూరు )  విద్యుత్ సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులకు PRC ( pay revision commite) ని వెంటనే ప్రకటించాలని Tspe(telangana state power emplooyes ) Jac నాయకులు డిమాండ్ చేశారు.విద్యుత్ ఉద్యోగులకు PRC ప్రకటించాలని TSPE JAC ఆధ్వర్యంలో జరుగుతున్న దశల వారి ఆందోళనలో భాగంగా మొదటి రోజు మణుగూరులోని బీటీపీఎస్ లో మంగళవారం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జేఏసీ బీటీపీఎస్ రీజియన్ చైర్మన్ వి. ప్రసాద్, పవర్ ఇంజనీర్ అసోసియేషన్ అధ్యక్షులు రవి ప్రసాద్, అసిస్టెంట్ ఇంజనీర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రవితేజ తదితరులు ప్రసంగించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పదకొండు నెలలు జాప్యమవుతున్న యాజమాన్యం PRC ప్రకటించకపోవడం శోచనీయమని ఆందోళన వ్యక్తం చేశారు.యాజమాన్య నిర్లక్ష్య వైఖరికి నిరసనగానే దశల వారి ఆందోళనలకు వెళ్తున్నామని ఆరోపించారు. ఆందోళన కార్యక్రమాలు వచ్చే నెల 24 వరకు కొనసాగుతాయని చెప్పారు.ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా ఈ నెల 24,25,27,28 తేదీల్లో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపుతామని పేర్కొన్నారు.వచ్చేనెల ఒకటి నుంచి నాలుగు వరకు మధ్యాహ్నం భోజన విరామ సమయంలో కర్మాగారంలో ధర్నాలు ఉంటాయని వివరించారు. వచ్చేనెల 8 నుంచి 23 వరకు రిలే నిరాహార దీక్షలు అనంతర 24న హైదరాబాదులో మహాధర్నా కార్యక్రమం నిర్వహిస్తామని వివరించారు. ఈ ఆందోళన కార్యక్రమాల్లో ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశ అనంతరం చీఫ్ ఇంజనీర్ బిచ్చన్నకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇంజనీర్ అసోసియేషన్ నాయకులు రాజబాబు, కార్మిక సంఘం-1104 అధ్యక్షుడు హేమ్లా నాయక్, UEEU అధ్యక్షులు వీరస్వామి, బీసీ సంఘం అధ్యక్షులు శ్రావణ్ కుమార్, ఇంజనీర్స్ అసోసియేషన్ నాయకులు నరేష్,సాయి, కార్మిక సంఘ నాయకులు సత్యనారాయణ, అనిల్, శివ, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

0Shares

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *