రైల్వే శాఖ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం
రైల్వే శాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలి
సిపిఎం సీనియర్ నాయకులు నెల్లూరి నాగేశ్వరరావు
మహానది ప్రతినిది ,మణుగూరు ఆదివారం 4 జూన్ : భారత కమ్యూనిస్టు పార్టీ ( మార్క్ స్ట్ )CPM బాధ్యుల సమావేశంలో కామ్రేడ్ బొల్లం రాజు అధ్యక్షతన ఒడిశాలో జరిగిన రైలు ఘటన అమరులకు #నివాళులర్పించారు నెల్లూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ రైల్వే శాఖ నిర్లక్ష్యం వల్లే ఒడిశాలోని బాలేశ్వరం జిల్లా బహుగాన్ రైల్వే స్టేషన్ సమీపంలో జరిగిన ఘోర ప్రమాదం జరిగిందని మణుగూరు మండల కమిటీ విమర్శించింది కేంద్రంలో మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు కూడా ఈ ప్రమాదం జరిగేందుకు కారణమని తెలిపింది ప్రమాద ఘటన లో ఇప్పటివరకు సుమారు 300 మంది ప్రయాణికులు మరణించినట్టు వెయ్యి మంది తీవ్ర గాయాలు పాలైనట్టు తెలుస్తుంది మరణాల సంఖ్య ఇంకా పెరగొచ్చు ప్రయాణకులలో సుమారు 170 మంది తెలుగువారు ఉన్నారని కొద్ది మంది చికిత్స పొందుతున్నట్టు వారు చెప్పారు రైల్వేలో ఆధునికరంలో భాగంగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తాయని విమర్శించారు వేలాది మంది ప్రయాణికులు ప్రాణాలు గాలిలో కలిసి పోతాయని ఆందోళన వ్యక్తం చేశారు రైల్వే స్టేషన్లో సౌకర్యాల కోసం కోట్లు ఖర్చు పెడుతున్నారని తెలిపారు అదే సమయంలో రైల్వే లైన్లో సిగ్నల్ వ్యవస్థ ట్రాకులు ఆధునీకరణ చేపట్టకపోవడం శోచనీయమని విమర్శించారు ఈ సమావేశంలో సిపిఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులు సత్ర పల్లి సాంబశివరావు. ఉపతల నరసింహారావు బొల్లం రాజు లెనిన్ బాబు నరసయ్య తదితరులు పాల్గొన్నారు
