జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలి- మెజిస్ట్రేట్ యం. వెంకటేశ్వర్లు
మణుగూరు, జూన్ 09: జూన్ నెల 10 న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నాడు జుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు- మణుగూరు కోర్టు ఆవరణలో మెజిస్ట్రేట్ యం. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ…. రాజీ మార్గమే రాజమార్గమని అన్నారు. కక్షిదారులలో అవగాహన కల్పించి రాజీ మార్గం ద్వారా కేసులు పరిష్కరించుకునేలాగున కృషి చేయాలని అన్నారు. ప్రజలకు సత్వర న్యాయం అందించేందుకు న్యాయశాఖ కృషి చేస్తున్నదని, ఇందులో భాగంగానే లోక్ అదాలత్ లను నిర్వహించి కేసులను పరిష్కరిస్తున్నదని తెలిపారు. వాది, ప్రతివాదులు కాలయాపన చేయకుండా రాజీ ద్వారా కేసులు పరిష్కరించుకోవాలని సూచించారు. కోర్టు కేసుల పెండింగ్ సమస్యకు లోక్ అదాలత్ పరిష్కారమని అన్నారు. కోర్టుల్లో పెండింగులో వున్నకేసుల్లో ఎక్కువగా క్రిమినల్ కేసులేనని, వాటిలో రాజీ పడదగిన క్రిమినల్ కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించకోవాలని అన్నారు. ఈ జాతీయ లోక్ అదాలత్ లో చిన్నచిన్న దొంగతనం కేసులు, ఇసుక, మట్టి, మద్యం అక్రమ రవాణా కేసులు, చిట్ ఫండ్ కేసులు, పేకాట కేసులు, యాక్సిడెంట్ కేసులు, కొట్లాట కేసులు, చీటింగ్ కేసులు, భూతగాదాలకు సంబంధించిన కేసులు, వివాహ బంధానికి సంబంధించిన కేసులు అనగా మనోవర్తి, గృహ హింస కేసులు, ట్రాఫిక్ సంబందిత కేసులు, గుట్కా కేసులు రాజీ చేసుకొని లేదా జరిమానా కట్టుకొని కేసును పూర్తిగా తీసివేసుకోవచ్చునని అన్నారు. ఈ జాతీయ లోక్ అదాలత్ ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోని కేసులను పరిష్కరించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది రేఖా, కోర్టు కానిస్టేబుల్ మురారి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

0Shares

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *