గ్రూప్ -4 పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలీ | జిల్లా కలెక్టర్ అనుదీప్

మహానది | భద్రాద్రి కొత్తగూడెం జిల్లా | గ్రూప్ -4 పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని చివరి నిమిషం వరకు వేచి ఉండి ఇబ్బందులు పడొద్దని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు గ్రూప్ ఫోర్ పరీక్ష నిర్వహణపై శుక్రవారం ఐడిఓసి కార్యాలయం నుండి చీఫ్ సూపరింటెండెంట్లు, రూట్ అధికారులు, లైజన్ అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూలై -1వ తేదీ ఉదయం 8 గంటల నుండి 9-45 వరకు, మధ్యాహ్నం 1 గంట నుంచి 2-15 గంటల వరకు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి ఉంటుందని చెప్పారు. ఉదయం 10 గంటల నుండి 12-30 గంటల వరకు ఒక.పేపర్, మధ్యాహ్నం 2-30 నుంచి 5 గంటల వరకు మరొక పేపర్ ఉంటుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ నిబంధనలు తు.చ తప్పక పాటించాలని చెప్పారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు సకాలంలో అనగా ముందస్తుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని ఆయన తెలిపారు. ఉదయం 8 గంటల నుండి 9-45 వరకు, మధ్యాహ్నం 1 గంట నుంచి 2-15 గంటల వరకు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి ఉంటుందని చెప్పారు. 9.45 తదుపరి, అలాగే మధ్యాహ్నం 2.15 గంటల తదుపరి ఒక నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతి లేదని గేట్లు మూసేస్తారని చెప్పారు. అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించి పరీక్షా సమయానికి ముందస్తుగానే చేరుకోవాలని చెప్పారు. అభ్యర్థులు వెంట ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకు రావొద్దని, ఒరిజినల్ హాల్ టికెట్ తో పాటు ఫోటో, ప్రభుత్వం జారీ చేసిన ఏదేని గుర్తింపు కార్డ్ తీసుకొని రావాలని సూచించారు. జిల్లాలో 77 పరీక్షా కేంద్రాలలో 27 వేల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారని తెలిపారు. పరీక్ష నిర్వహణకు 77 మంది చీఫ్ సూపరిన్టెండ్లు, 77 మంది లైసన్ అధికారులు, 36 మంది రూటు అధికారును నియమించి నట్లు చెప్పారు. పరీక్షా కేంద్రాల్లోకి వెళ్ళే సమయంలో అభ్యర్థులను నిశిత పరిశీలన చేయాలని చెప్పారు. అభ్యర్థులు ఆభరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, సెల్ ఫోన్ లు వెంట తీసుకొని రావద్దని అనుమతి లేదని తెలిపారు. అభ్యర్థులు ఓ.ఎం.ఆర్. షిట్ పై సూచనలు చదవాలని, హాల్ టికెట్ నెంబర్, ప్రశ్నా పత్రం నెంబర్ సరిగ్గా నమోదు చేయాలని చెప్పారు.పరీక్షా హల్ లో ప్రతి అరగంటకు ఒకసారి బెల్ కొడతారని చివరి 5 నిమిషాలను సూచిస్తూ వార్నింగ్ బెల్ మోగుతుందని , దీనికి అనుగుణంగా అభ్యర్థులు సమయ పాలన పాటించాలని చెప్పారు. ఓఎంఆర్ షిట్ పై వైట్నర్, అరేజర్, ట్యాంపరింగ్ లకు పాల్పడొద్దని, అలా చేస్తే ఓఎంఆర్ షీట్ చెల్లదని చెప్పారు. పరిక్షా కేంద్రాల్లో ఇతరులతో మాట్లాడటం కానీ డిస్ట్రబ్ చేయడం కానీ చేయకూడదని చెప్పారు. పరీక్ష ముగిసిన తదుపరి అభ్యర్థులు ఓఎంఆర్ షీట్ అప్పజెప్పిన తర్వాత ఎడమచేతి బొటనవేలు థంబ్ ఇంప్రెషన్ ఇవ్వాలని కలెక్టర్ తెలిపారు. ప్రశ్న పత్రాలను నిర్దేశించిన రూటులో పటిష్ట బందోబస్తు మధ్య కస్టడీ నుండి తీసుకెళ్లాలని చెప్పారు.
ఈ టెలి కాన్ఫెరెన్సు లో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, చీఫ్ సూపరింటెండెన్లు, రూట్ అధికారులు, లైసన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

0Shares

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *