పోడు భూముల సమస్య పరిస్కారం కోసమే పార్టీ మారిన: రేగా కాంతారావు
మహనది 1 జూలై, 2023 (పినపాక ఆర్.సి. ఇంచార్జ్): పోడు భూముల శాశ్వత పరిష్కారం కోసమే ఆనాడు పార్టీ మారానని పినపాక శాసన సభ్యులు, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ఉద్గాటించారు. శనివారం నాడు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం ఆయన మాట్లాడుతూ… 2024 లో జరుగయే సార్వత్రిక ఏన్నికల్లో బా.రా.స ప్రభుత్వం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదికి పది స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేసారు. ఈ సందర్బంగా ప్రత్యర్ధులపై తీవ్ర స్తాయిలో విరుచుకపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు సమస్యల పరిస్కారం కోసం అడగటం చేతకాని సన్నాసులు ఈ రోజు మాట్లాడతుండ్రని అన్నారు. 2024 ఏన్నికల తర్వాత నా బొ…. కుడా పీకలేరని అన్నారు. ఖమ్మం మాజీ యం.పి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఉద్ద్యేచించి మాట్లాడుతూ యం.పి గా ఉన్నప్పుడు ఉమ్మడి జిల్లాకు ఎమి అభివృద్ధి చేసినవో చెప్పాలని ప్రశ్నించారు. వీళ్ళ భేదిరింపులకు భయపడే ప్రసక్తి లేదు ఇన్ని రోజులు పార్టి లోనే ఉంటూ గోడ మీద పిల్లి లాగ వ్యవరించిండ్రని అన్నారు. ఈ రోజుతో పార్టీ కి పట్టిన దరిద్రం పోయిందని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ వజ్రపు తునకని, ఉద్యమ ధీరుడని, జల్ జంగల్ జమీన్ నినాదంతో ఉద్యమించి, కొమ్రమ్ భీమ్ ఆశయాలను నెరవెర్చిన ధీశాలని, అలాంటి ఉన్నతమైన ఆశయాలు కలిగిన మా నాయకుని గురించి అవాకులు చవాకులు పేలితే ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. బిజెపి వారు వంద కోట్లు ఇచ్చి నన్ను కొనాలని చూశారని, కానీ అదే వంద కోట్ల రూపాయల అభివృద్ది నిదులు తీసుకు వచ్చి, పినపాక నియోజకవర్గాన్ని అభివృద్దిపథంలో ముందుకు తీసుకెళ్లానని తెలిపారు. అనాడు పార్టీ నమ్ముకొని పోయినందుకు నాకు ముఖ్యంమంత్రి తగిన గౌరవం ఇచ్చిండని, పోడు భూములపై అసెంబ్లీలో పదే పదే అడిగినందుకు ముఖ్యమంత్రి నా ఆవేదను అర్ధం చేసుకొని పోడు భూములకు పట్టాలు ఇవ్వడమే కాకుండా, తక్షణమే రైతు బంధు వర్తింపజేయడం, భూములకు శాశ్వత పరిష్కారం జరిగిందని హర్షం వ్యక్తం చేశారు. ప్రతి పక్ష పార్టీ అధ్యక్షుడు నాకు మూడు వేల ఎకరాల పోడు భూములు ఉన్నాయని, పినపాకకు వచ్చిన సందర్బంలో ఆరోపించారని, మరి ఎక్కడున్నాయో రేవంత్ రెడ్డినే అడగాలని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో జడ్.పి.టి.సి పోశం నర్సింహారావు, కుర్రి నాగేశ్వరరావు, అడపా అప్పారావు, బొలిశెట్టి నవీన్, వట్టం రాంబాబు, భవాని శంకర్ తదితరులు పాల్గొన్నారు
