సీఎం కేసీఆర్ కి, ప్రభుత్వం విప్ రేగా కి కృతజ్ఞతలు తెలిపిన కూనవరం గ్రామం పోడు రైతులు -కూనవరం గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎనిక ప్రసాద్ ఆధ్వర్యంలో.
పోడు పట్టాలతో గిరిజనజీవితాలలో వెలుగులు నిప్పి-పోడు పట్టాలు రైతుబంధుతో గిరిజనులకు డబుల్ ధమాకానుఇచ్చినారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ శ్రీ రేగా కాంతారావు ఆదేశాల మేరకు…
మహానది న్యూస్ ,జూలై 02.07.2023 | మణుగూరు మండలం, కూనవరం గ్రామపంచాయతీ, కూనవరం గ్రామ బొడ్రాయి నందు గిరిజనుల ఆరాధ్య దైవం సీఎం కేసీఆర్ గారు ఎన్నో సంవత్సరాల కలను పోడు పట్టాల పంపిణీ తో సీఎం కేసీఆర్ గిరిజనుల జీవితాలలో వెలుగులు నింపిన నేపథ్యంలో సీఎం కెసిఆర్ పాలాభిషేకం నిర్వహించారు భారీ ఎత్తున పోడు రైతులు పాలాభిషేకంలో పాల్గొన్నారు ఈసందర్భంగా మణుగూరు జడ్పీటీసీ పోశం నరసింహరావు మాట్లాడుతూ…తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత గిరిజనులకు శాశ్వత భూ యజమానులుగా హక్కు కల్పించాలని గొప్ప ఉద్దేశంతో సీఎం కేసీఆర్ పోడు పట్టాలు పంపిణీ,గిరిజనుల జీవితాలనువెలుగులు నింపరని అన్నారు.హక్కు పత్రాలు ఇవ్వడమే కాకుండా పెట్టుబడి కి రైతుబంధు ద్వారా నగదును కూడా చెల్లించడం జరుగుతుంది అన్నారు, 75 ఏళ్లలో సాధ్యం కానీ అభివృద్ధి కేవలం 9 ఏళ్లలోనే సాధ్యం చేసి చూపించిన ఘనుడు సీఎం కేసీఆర్ అని అన్నారు, గిరిజనుల గుండెల్లో సీఎం కేసీఆర్ నిలుస్తారని చెప్పారు అడవి భూములు నమ్ముకుని జీవిస్తున్న తెలంగాణ ప్రజలు సీఎం కేసీఆర్ ని ఆశీర్వదించి మూడోసారి ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కూనవరం ఎంపీటీసీ సభ్యులు గుడిపూడి కోటేశ్వరరావు, పినపాక నియోజకవర్గం BRS యువజన నాయకులు నవీన్ బాబు, BRS మండల నాయకులు మడి వీరన్నబాబు,BRS పార్టీ కూనవరం అధ్యక్షులు పిన్నాక వెంకట్రావు,కూనవరం గ్రామవార్డుసభ్యులు వంక సూరయ్య, ఏనిక సమ్మయ్య,మేకల రాములు,ఏనిక చిట్టయ్య, మడకం పెంటయ్య, పాయం రామచంద్రు, గుగులోత్ హటియా, జట్పట్ వెంకన్న,తదితరులు పాల్గొన్నారు.