ఆదివాసి గ్రామాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలి
ఐ ఎఫ్ టి యు ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వరావు గారికి వినతి పత్రం అందజేత
మహానది న్యూస్ ,కొత్తగూడెం ,జూలై 10.2023,మణుగూరు,పినపాక, అశ్వాపురం మండలాల పరిధిలోని గిరిజన ఆదివాసి గ్రామాల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ ఐ ఎఫ్ టి యు ఆధ్వర్యంలో సోమవారం గ్రీవెన్స్ డే సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వరరావు గారికి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా నాయకులు ఎస్ డి నాసర్ పాషా, మిడిదొడ్ల నాగేశ్వరరావు, లు మాట్లాడుతూ పై మూడు మండలాలకు సంబంధించిన గిరిజన ఆదివాసి గ్రామాలు పెద్దిపల్లి,బుగ్గ ఖమ్మంతోగు, బుడుగుల, రేగుల గండి, సర్వాయి గుంపు ,రాయనపేట కుమ్మరి గుంపు పిట్టతోగు మనుబోతుల గూడెం కొత్త గుంపు అశ్వాపురం పాడు తదితర గిరిజన ఆదివాసి గ్రామాలలో రోడ్లు తాగునీరు విద్యుత్ సౌకర్యం ప్రాథమిక పాఠశాలలు నిర్మాణం నాకు నిధులు మంజూరు చేయాలని కోరారు అలాగే కొత్త కొండాపురం హిందూ స్మశాన వాటికకు స్థలం కేటాయించాలని త్రాగునీటికి సింగరేణి సి ఎస్ ఆర్ నిధులు మంజూరు చేయాలని ఆ వినతిపత్రంలో కోరినట్టు తెలిపారు సమితి సింగారం పంచాయతీ పరిధిలోని ఎస్సీ కాలనీ సీతానగరం గ్రామానికి తాగునీటి సమస్య మరియు మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎసిడి నాసర్ పాషా ఎం నాగేశ్వరరావు, ఏ మంగీలాల్, మడకం బాబురావు, సోమయ్య నరసింహారావు కుంజా రమేష్, తదితరులు తదితర గ్రామాల ఆదివాసులు పాల్గొన్నారు