క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నామిత్రునికి తోటి పాఠశాల స్నేహితులు ఆర్థిక సహాయం
మహానది న్యూస్ ,పినపాక, జూలై 10.08.2023 , భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ,పినపాక మండలం , సీతంపేట గ్రామానికి చెందిన పాలడుగు ప్రకాశం గత కొంతకాలం గా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు. మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రిలో చూపించుకోవడానికి ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్నాడు. ఈ విషయం సోషల్ మీడియా whatsapp గ్రూప్ ద్వార తెలుసుకున్న 1994-95 పదవ తరగతి క్లాస్మేట్స్ 24 వేలు ఆర్ధిక సహాయం అందించి దైర్యంగా ఉండాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో తోటి మిత్రులు శిరీష, చిర్రా పుష్ప, నిర్మల, శారద,వెంకట రమణ ,విజయ , శీను, రమణ, సుజాత, మురళి, మూర్తి, రామారావు, వెంకటేశ్వర్లు,బాగి శ్రీను పాల్గొన్నారు.