గోదావరి ముప్పు వరద బాధితులకు పక్కా గృహాలు మంజూరు చేయాలి ముఖ్యమంత్రి హామీ నిలబెట్టుకోవాలి
సిపి ఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ వద్ద భారీ ధర్నా

 మహానది న్యూస్ ,కొత్తగూడెం ,జూలై 10.2023,  భద్రాచలం, మణుగూరు, ఆశాపురం పినపాక మండలాల గోదావరి వరద ముంపు బాధితులకు పక్కా గృహాలు మంజూరు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ అనుబంధ ప్రజా సంఘాలు ప్రగతిశీల మహిళా సంఘం, అఖిలభారత రైతు కూలి సంఘం సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం నాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద భారీ ఎత్తున ధర్నా నిర్వహించారు సుమారు 600 మంది పైగా ఈ ధర్నాలో పాల్గొనగా ఎండని సైతం లెక్కచేయకుండా ఎక్కువ మంది మహిళలు పాల్గొనడం విశేషం ఈ ధర్నానుద్దేశించి అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏ ఐ కె ఎమ్ ఎస్) జిల్లా అధ్యక్షులు బానోత్ ఊక్లా, ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్ద గోని ఆదిలక్ష్మి( పి ఓ డబ్ల్యు) లు మాట్లాడుతూ గత సంవత్సరం గోదావరి వరదల కనీ వినీ ఎరుగని రీతిలో 71.3 అడుగులు వరద ప్రవాహం భద్రాచలం, మణుగూరు, అశ్వాపురం, పినపాక మండలాల్లో గోదావరి పరివాహక ప్రాంతాల్లో 103 గ్రామాలు వరదలో చిక్కుకున్నాయని ఈ విపత్తు సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ భద్రాచలంలో ముంపు ప్రాంతాలను సందర్శించి క్లౌడ్ బరస్ట్ అని భయపెట్టడంతోపాటు తక్షణ సహాయంగా పదివేల రూపాయలు ప్రకటించడంతోపాటు బాధితులకు ప్రతి ఒక్కరికి పక్కా గృహాలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారని కానీ ఆ హామీలు 360 రోజులు గడిచినా నేటికీ అమలు కాక నీటి మూటలు అయ్యాయనీ వారు వాపోయారు, చివరికి రాష్ట్ర గవర్నర్ గారు కూడా ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోయారని వారు అన్నారు,ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నాగేంద్ర కమిటీ సిఫారసు మేరకు వరద ముంపు అర్హులందరికీ సురక్షిత ప్రాంతాలలో పక్కా ఇండ్లు (డబల్ బెడ్ రూమ్ ఇండ్లు) మంజూరు చేయాలని, గోదావరికి ఇరువైపులా ఈ ప్రాంతంలో 16 కిలోమీటర్ల పొడవునా కరకట్ట కు 1700 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయాలని, బొగ్గు ఇసుక కలప లిక్కర్ తదితర పరిశ్రమ నుండి ప్రభుత్వానికి వచ్చే ఆదాయం నుండి నిధులను చేసి మౌలిక వసతులు కల్పించాలని 2006 అటవీ హక్కుల చట్టానికి లోబడి దరఖాస్తుదారులు అందరికీ పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని,రెవెన్యూ, ఫారెస్టు, అధికార పార్టీ నాయకుల లంచాలు అవినీతి కట్టడి చేయాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని గ్రీవెన్స్ డే సందర్భంగా జాయింట్ కలెక్టర్ (జెసి)వెంకటేశ్వరరావు గారికి ప్రతినిధి బృందం సభ్యులు అందజేశారు, సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని జాయింట్ కలెక్టర్ హామీ ఇచ్చారని సానుకూలంగా స్పందించారని నాయకులు తెలిపారు, ఈ కార్యక్రమంలో నాయకులు పోరాట కమిటీ సభ్యులు బానోత్ ఊ క్లా ,p పెద్దగోని ఆదిలక్ష్మి, సున్నం భూలక్ష్మి, కుర్సం సుజాత, కొడెం రాధ, ఎర్రయ్య, యశోద, మిడిదొడ్ల నాగేశ్వరరావు, ఏ మంగీలాల్,డి పునంచంద్, కె ధనలక్ష్మి, ఎల్ రవి, దుర్గం ప్రణయ్, సాంబ, గణేష్, ఆర్ లక్ష్మి, రావులపల్లి ముత్తమ్మ ,కమలమ్మ, రమణ తదితరులు పాల్గొన్నారు.

0Shares

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *