గిరిజనులు అధికంగా నివసించే జిల్లాలో జిల్లా కలెక్టర్ గా విధులు నిర్వహించే అవకాశం రావడం చాలా సంతోషం గా ఉంది | జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా
మహానది న్యూస్ ,కొత్తగూడెం ,15.07.2023 ,గిరిజనులు అధికంగా నివసించే జిల్లాలో జిల్లా కలెక్టర్ గా విధులు నిర్వహించే అవకాశం రావడం చాలా సంతోషం గా ఉన్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా తెలిపారు. శనివారం జిల్లా కలెక్టర్ గా పదవీ బాధ్యతలు సాయంత్రం 4.23 నిమిషాలకు బడిఓసిలో తన చాంబర్లో తొలి సంతకం చేసి నూతన కలెక్టర్ గా బాద్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అన్ని శాఖల జిల్లా అధికారులు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కలెక్టర్ చాంబర్ లో జిల్లా అధికారులతో పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పెద్ద జిల్లాలో కలెక్టర్ గా పనిచేసే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ప్రభుత్వ ప్రాధాన్యతలు, లక్ష్యాల మేరకు అందరిని సమన్వయం చేస్తూ ప్రజలకు సేవలు అందిస్తానని చెప్పారు. తాను పుట్టి పెరిగింది తెలంగాణలోనేనని, మన రాష్ర్టంలో లోనే కలెక్టర్ గా పని చేయడం సంతోషంగా ఉన్నట్లు చెప్పారు. గిరిజనులు అధికంగా నివసించే ఈ జిల్లా ప్రజలకు సేవలు అందించే అవకాశం రావడం చాలా సంతోషమని చెప్పారు. విద్యాభ్యాసం రోజుల్లో చిన్నతనంలో మియారులతో ఈ ప్రాంతానికి వచ్చానని, ఈ ప్రాంతం పట్ల సమగ్రమైన అవగాహన ఉన్నట్లు చెప్పారు. వైద్య విద్యనభ్యసించిన తాను ప్రజలకు సేవ చేసేందుకు సివిల్ సర్వీస్ లోకి వచ్చినట్లు చెప్పారు. 2016లో సివిల్స్ సాధించిన తాను భువనగిరి, జిహెచ్ఎంసి హైదరాబాదులో అదనపు కమిషనర్ గా విధులు నిర్వహించినట్లు చెప్పారు. అనంతరం కలెక్టర్ క్యాంపు కార్యాలయంను సందర్శించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.