వృద్ధ మహిళలకు ఆర్థిక సహాయం అందించిన దనసరి సూర్య.
మహానది న్యూస్ ,పినపాక ,15.07.2023 , భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం గోపాలరావుపేట గ్రామం లో నివాసం ఉంటున్న పెద్ది దుర్గమ్మ,బూర సమ్మక్క అనే ఇద్దరి ఒంటరి వృద్ధ మహిళల ఇల్లులు కూలిపోవడంతో నిలువ నీడ లేక జీవనం సాగిస్తున్న ఆ వృద్ధ మహిళల నిస్సహాయక స్థితికి చలించిపోయి వారికి పెద్ద కొడుకుగా అండగా నిలచి బాధితులకు చేరో ఐదువేల రూపాయల చొప్పున మొత్తం 10000 వేల ఆర్థిక సాయం అందజేసిన పినపాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ యువనేత ధనసరి సూర్య. ఈ కార్యక్రమం లో సోషల్ మీడియా, మీడియా ప్రతినిధి అచ్చా నవీన్, కార్మిక శాఖ మహిళా అధ్యక్షురాలు బోగినేని వరలక్ష్మి, పినపాక నియోజకవర్గం మహిళా నాయకురాలు గొంది రాధ,పినపాక మండల కాంగ్రెస్ నాయకులు పూనెం వెంకటేష్,బండారు గిరి ప్రసాద్, ఉప్పల సతీష్, నర్రా ఉమేష్, కొండా రాకేష్, పసల రాము, వడ్డె వినోద్ కుమార్, చింతల వెంకన్న, సూర్యన్న ప్రచారకర్త చందా వర ప్రసాద్,రసమళ్ళ నాగరాజు, పల్లపు సంపత్, కట్టం సాయి తదితరులు పాల్గొన్నారు.