అధికారులు అందుబాటులో ఉండాలి | ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
మహానది వెబ్ న్యూస్ :జూలై 18.2023, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: మణుగూరు మండలం: వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు రెండు, మూడు , రోజులపాటు వర్షాలు కురుస్తాయన్న నేపథ్యంలో ప్రజల అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు & భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ప్రకటన చేశారు, రెవెన్యూ పిఆర్ పోలీస్ నీటిపారుదల శాఖలకు సంబంధించిన అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా ఉండి చెరువులు కుంటలు పొంగి ప్రవహించే చోటుకు జాలర్లు ప్రజలు పశువులు వెళ్లకుండా అలాగే గ్రామాలలో పాత మట్టి గోడలు తడిసి ఉన్న కరెంటు స్తంభాల వద్ద పిల్లలను వెళ్లకుండా ఎలాంటి ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా ప్రజలకు అందుబాటులో ఉండాలని తెలిపారు, నియోజకవర్గ వ్యాప్తంగా అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు ముంపు ప్రాంతాల ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని ఒక ప్రకటనలో తెలిపారు, వర్షాల వల్ల సీజనల్ వ్యాధులు ప్రబలే ఆకాశము ఉందన్నారు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది అన్నారు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు…