కాంగ్రెస్ పార్టీ రెక్కల కష్టం మీద గెలిచి కాంతారావు రాజ్యమేలుతున్నాడు
ప్రజలు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది
పినపాక నియోజకవర్గం టిపిసిసి సభ్యులు డాక్టర్ చందా సంతోష్ గాటైన వ్యాఖ్యలు
మహానది న్యూస్ ,మణుగూరు జూలై 31,2023:పినపాక నియోజకవర్గం లో రేగా కాంతారావు పూర్తిగా విఫలమయ్యాడని పరిపాలనంత కూడా అవినీతిమయం అయిందని ఎక్కడ చూసినా భూకబ్జాలు, ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా ఇవి తప్పితే వేరే ఆలోచన లేని విధంగా పరిపాలన సాగిస్తున్నాడని అన్నారు. పినపాక అభివృద్ధి గురించి జరిగిన చర్చల్లో సమాధానం చెప్పకుండా పారిపోయిన పరిస్థితి ఏర్పడిందని ఎద్దేవా చేశారు. రేగ కాంతరావు చేసిన అభివృద్ధి శూన్యమని గత ప్రభుత్వాలు అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేశారో అవన్నీ కూడా జీవోలుగా మార్చి నేను అభివృద్ధి చేశానని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడని అన్నారు. ఆయన సొంత మండలంలో కరకగూడెంలో అభివృద్ధి శూన్యమని అక్కడున్న డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇంతవరకు ప్రారంభించలేకపోయారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కట్టిన మినీ స్టేడియంను కూడా ఇప్పటివరకు వినియోగంలోకి తీసుకురాలేకపోయాడని తెలిపారు. కరకగూడెం నుండి గుండాల వరకు కరకగూడెం నుండి మర్కోడు, ఆళ్లపల్లి వరకు రోడ్లను పూర్తి చేయలేని దయనీస్థితిలో కాంతారావు ఉన్నాడని అన్నారు. నీ పరిపాలనలో ఏమి అభివృద్ధి జరిగింది నీ చుట్టూ ఉన్న గుంపు సంపాదన తప్పితే వేరే ఆలోచన నీకు లేదని మండిపడ్డారు. పోడు భూముల పట్టాలు 100 పడకల ఆసుపత్రి గురించి రోడ్డెక్కి ధర్నాలు చేస్తే ఈరోజు అరకొరగా వైద్యం అందుతుందని అన్నారు. పూర్తి స్థాయిలో వైద్యులు లేరని సిబ్బంది లేరని ఏదైనా ప్రమాదం జరిగితే వైద్యం అందివ్వడానికి వైద్యులు లేరని అన్నారు. నువ్వు ఇక్కడ ఎవరిని మోసం చేయడానికి ఉన్నావని తూర్పారబడ్డారు. పేదవాడు ఇల్లు కట్టుకుంటే వారిని నానా గోసబెట్టి భూమిని కబ్జా చేసే వరకు ఈ ఎమ్మెల్యే నిద్ర పోవట్లేదు అని అన్నారు కాంగ్రెస్ పార్టీ రెక్కల కష్టం మీద గెలిచిన రేగా కాంతారావు ఈరోజు రాజ్యమేలుతున్నారని అన్నారు. నీకు ప్రజలు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని తెలియజేశారు.ఎవరు అధైర్య పడాల్సిన అవసరం లేదని వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని సబ్బండ వర్గాలఅభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమని తెలిపారు.