-
ఇళ్ళు కూలిపోయి దీన స్థితిలో సీనియర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ముక్కెర లక్ష్మణ్.
-
ఆర్థిక సహాయం అందించిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ యువజన కార్యదర్శి దనసరి సూర్య.
మహానది న్యూస్ ,మణుగూరు జూలై 31,2023:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పట్టణంలో నివసిస్తున్న ముక్కెర లక్ష్మణ్ మాజీ ఎంపీటీసీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త , ఏళ్ల తరబడి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు తన సొంత కుటుంబ సభ్యుల వలె సేవలు చేస్తూ,కాంగ్రెస్ పార్టీ జెండా పట్టి రోడ్లపై తిరిగి నినాదాలు చేస్తూ ,స్థంబాల ఎక్కి కాంగ్రెస్ జెండాలు కట్టి కొన్ని ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ కి ఎనలేని కృషి చేసాడు, ప్రస్తుతం చేస్తున్నాడు. ఇతర పార్టీల వాళ్ళు మీకు అన్నీ సౌకర్యాలు కల్పిస్తాం.మా పార్టీ లోకి రమ్మని ఆహ్వానించిన కట్టే కాలే వరకు గంజి నీళ్ళైనా తాగి బ్రతుకుతా కానీ కాంగ్రెస్ పార్టీ ని వీడేదే లేదని మొండిపట్టు పట్టి మరి పార్టీని వీడకుండా ఉన్న సీనియర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త జీవన పరిస్థితి ఇప్పుడు దుర్భరంగా మారింది.
ఇటీవల కురిసిన వర్షాలకు తన ఇంటి గోడలు కూలిపోయి, ఇళ్ళు కూడా రేపో మాపో కూలిపోయేలా ఉంది.కాంగ్రెస్ పార్టీ వీరాభిమాని గురించి స్థానిక నాయకుల ద్వారా తెలుసుకున్న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ యువజన కార్యదర్శి దనసరి సూర్య తన ఇంటికి వెళ్లి తనను పరామర్శించి, తన ఇంటి పరిస్థితిని పరిశీలించి చలించిన హృదయంతో వెంటనే ఖర్చుల నిమిత్తం తన వంతు ఆర్థిక సహాయం అందించారు.అలాగే తన ఇంటికి రేకులు వేపిస్తానని హామీ ఇచ్చారు.ఇకపై అతనికి ఎటువంటి ఆపద వచ్చిన కాంగ్రెస్ పార్టీ తరుపున అండగా ఉంటామని భరోసా కల్పించారు.నియోజకవర్గం లోని కార్యకర్తలు, నాయకులు తమకు తోచిన సహాయం అందించి ఆ సీనియర్ కార్యకర్త ను ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించాల్సిన బాధ్యత మన పై ఎంతైనా ఉందని, ప్రతీ ఒక్క కార్యకర్త అతనికి సహాయం అందించి కాంగ్రెస్ పార్టీ ఐక్యత ని చాటాలని విన్నవించుకున్నారు.ఈ కార్యక్రమం లో జిల్లా కార్మిక శాఖ మహిళా అధ్యక్షురాలు బోగినేని వరలక్ష్మి, మణుగూరు మండల యువజన నాయకులు రాసమళ్ళ నాగరాజు, సూర్యన్న ప్రచార కర్త చందా వర ప్రసాద్, కట్టం సాయి తదితరులు పాల్గొన్నారు.