తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ భద్రాచలం డివిజన్ మహాసభ బ్రోచర్ విడుదల
మహానది న్యూస్ , ఆగష్టు 19 ,హైదరాబద్ : వర్కింగ్ జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం అలుపు ఎరగని పోరాటాలు చేసే ఏకైక జర్నలిస్ట్ యూనియన్ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ మాత్రమేనని రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య ప్రధాన కార్యదర్శి బసవపు అన్నయ్య రాష్ట్ర కార్యదర్శి కర్ర అనిల్ రెడ్డి అన్నారు. ఈనెల 27వ తేదీన చర్ల మండల కేంద్రంలో నిర్వహించే తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ భద్రాచలం డివిజన్ మహాసభ బ్రోచర్ ను హైదరాబాద్ చిక్కడపల్లి లోని త్యాగరాయ గాన సభ ఫంక్షన్ హాల్ లో వారు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ జర్నలిస్టుల సమస్యలపై పోరాటాలు నిర్వహించడంలో ముందు వరుసలో ఉందన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఇండ్లు ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డులు, అక్రిడిటేషన్ కార్డులు ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తామని సందర్భంగా వారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పూదోట సూరిబాబు, గుండెబోయిన వెంకటేశ్వర్లు, రాష్ట్ర కమిటీ సభ్యులు డి రవికుమార్, జిల్లా ఉపాధ్యక్షులు తోటమల్ల రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు