కాలుష్య రహిత జీవనానికి కృషి : జమాల్ ఖాన్
మహానది న్యూస్, ఆగష్టు 21,గుంటూరు : నేషనల్ ట్రెడిషనల్ హీలర్స్ కార్యక్రమం పారంపర్య వైద్య మహా సంఘం ఆధ్వర్యంలో జాతీయ సాంప్రదాయ వైద్యుల శిక్షణ తరగతులు గుంటూరు జిల్లా అమరావతి తాళాయపాలెంలోని శైవ క్షేత్రములో నిర్వహించారు ఈ సమావేశంలో దక్షిణ భారతదేశంలోని సాంప్రదాయ వైద్యులు అందరూ పాల్గొన్నారు వివిధ రకములైన రుగ్మతలకు తాత్కాలిక, దీర్ఘకాలిక ఉపశమనము నిర్మూలన అంశాలపై వారి యొక్క అనుభవ విధానాలను వివరించారు సమాజానికి ఆరోగ్య వాతావరణానికి కాలుష్య రహిత జీవనానికి పర్యావరణ పరిరక్షణకు ఈ పారంపర్య వైద్య సంఘ సభ్యులు పాటుపడాలని వారి యొక్క సందేశాన్ని తెలియజేశారు ఈ సందర్భంగా వృద్ధులైనటువంటి 70 సంవత్సరములు పైబడిన గురువులకు సన్మానం చేశారు ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఆనందయ్య ప్రముఖ మూలికా వైద్యులు మహమ్మద్ జమాల్ ఖాన్, నెల్లూరుకు చెందిన వేణుగోపాల్ రెడ్డిని ఫారంపర్య వైద్యరత్న అవార్డుతో పాటు ధన్వంతరి స్వామి పంచలోహ విగ్రహాన్ని బహుకరించారు. వీరి సేవలకు గుర్తింపుగా పారంపర్య వైశ్య మహాసంఘం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ సమావేశానికి అనేక రాష్ట్రాల నుండి సాంప్రదాయ వైద్యులు పాల్గొన్నారు