రొటేరియన్లు భగవంతునికి ప్రీతిపాత్రులు : గరికపాటి
మహానది న్యూస్, ఆగష్టు 21,హైదారాబాద్ : భగవంతుని అనుగ్రహం పొందిన వారు మాత్రమే రోటరీ సభ్యులు కాగలుగుతారని, రొటేరియన్లు అందరూ సేవకు ప్రతిరూపాలు, భగవంతునికి ప్రీతిపాత్రులని పద్మశ్రీ అవార్డు గ్రహీత, బ్రహ్మశ్రీ డా.గరికపాటి నరసింహారావు ఉద్ఘాటించారు హైదరాబాదులోని జలవిహార్ నందలి వేదిక కన్వెన్షన్ హాలులో రోటరీ ఇంటర్నేషనల్ గవర్నరు డా.బూసిరెడ్డి శంకర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన తెలంగాణ రాష్ట్ర మరియూ గుంటూరు ప్రకాశం జిల్లాల పరిధిలోని రోటరీ ఇంటర్నేషనల్ జిల్లా-3150 మెంబర్షిప్ మరియూ పబ్లిక్ ఇమేజ్ సెమినార్ కార్యక్రమానికి విశిష్ట అతిధిగా పాల్గొన్న పద్మశ్రీ అవార్డు గ్రహీత, బ్రహ్మశ్రీ డా.గరికపాటి నరసింహారావు తన ప్రవచనం ద్వారా సేవకు అర్ధం పరమార్ధం తెలియజేస్తూ కార్యక్రమంలో పాల్గొన్న సభికులను ఉత్తేజితులను చేశారు. రోటరీ సభ్యులు అందరూ సమాజ సేవలో పునీతులవుతున్నారని ప్రశంషిస్తూ, మహిళలు శక్తి స్వరూపులనీ మహిళలను ఎల్లవేళలా గౌరవించాలని, కాబట్టి మరింత మంది మహిళామణులకు కుడా రోటరీ సంస్థలో సభ్యత్వం కల్పించి మహిళలను కూడా సమాజ సేవలో భాగస్వాములను చేస్తూ రోటరీ సేవలను మరింతగా విస్తృతపరుచాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో రోటరీ ఇంటర్నేషనల్ జిల్లా-3150 గవర్నరు డా.బూసిరెడ్డి శంకర్ రెడ్డితో పాటుగా ముఖ్యాతిధిగా ఒరిస్సా రాష్ట్ర రోటరీ ఇంటర్నేషనల్ జిల్లా గవర్నరు జయశ్రీ మహంతి, గౌరవ అతిథులుగా రోటరీ ఇంటర్నేషనల్ ఏరియా మెంబర్షిప్ డేవలప్మెంట్ ఛైర్మన్ వీరభద్రారెడ్డి, రోటరీ ఇంటర్నేషనల్ ఏరియా పబ్లిక్ ఇమేజ్ డేవలప్మెంట్ ఛైర్మన్ మునిగిరీష్, కార్యక్రమ నిర్వాహకులు శ్రీ.టి వీ ఆర్ మూర్తి పాల్గొన్నారు