మణుగూరు డిఎస్పీ ఆధ్వర్యంలో పట్టణ పీస్ కమిటీ మీటింగ్
మహానది న్యూస్ : మణుగూరు ప్రతినిది ,సెప్టెంబర్ , 11.2023 : మణుగూరు డిఎస్పీ ఆధ్వర్యంలో మణుగూరు సిఐ పట్టణ పీస్ కమిటీ మీటింగ్ డి.ఎస్.పి ఆఫీస్ లో నిర్వహించడం జరిగింది ఇట్టి మీటింగ్ ముక్య ఉద్దేశం రాబోయే వారం రోజుల్లో జరగబోవు పండుగ గురించి పీస్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది మణుగూరు పట్టణం మరియు మణుగూరు మండలం మున్సిపాలిటీ ఏరియాలో ప్రతిష్టించే వినాయకుల విగ్రహాల గురించి మరియు దానికి సంబంధించిన నిమజ్జనాల గురించి అదే విధంగా మీలాద్ ఉన్ నభి పండుగ సందర్భంగా మరియు దానికి సంబంధించిన ర్యాలీ గురించి అదే విధంగా ఈ సమయాలలో చర్చి వాళ్ళు తీసుకోవాల్సిన నియమావళి గురించి ఈ పీస్ కమిటీ మీటింగ్లో చర్చించడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో వినాయక నిమజ్జనం రోజు DJ లకు అనుమతి లేదు అదే విధంగా ఎవరు మద్యం సేవించి ప్రజాశాంతికి భంగం కలిగే విధంగా ప్రవర్తించిన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకొనబడును ప్రతి వినాయకుడిని ప్రతిష్టించే పీఠం వద్ద దానికి సంబంధించి ఎవరు ఉంటున్నారు ఆ కమిటీ రెస్పాన్సిబిలిటీ పర్సన్ ఎవరు దానికి సంబంధించిన వివరాలు పోలీస్ స్టేషన్లో అందియాల్సి ఉంటుంది. అదేవిధంగా వారు ఏ వాహనాన్ని వినియోగిస్తున్నారు, ఏరోజు నిమజ్జనం చేస్తున్నారు అనే విషయాలు కూడా ముందస్తుగానే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. ఎట్టి పరిస్థితుల్లో అందరూ మైకు పర్మిషన్ మరియు కరెంటు పర్మిషన్ సంబందిత కర్యాలయాల నుండి పొందవలేను. అదేవిధంగా స్టేజీలు వేసే దగ్గర అన్నదాన కార్యక్రమాలు జరగే దగ్గర మిగిలిన ప్రజలకు మరియు అట్టి కాలనీవాసులకు ఉన్నటువంటి మిగతా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఆ కమిటీ వారు చూసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి వాతావరణం లో ప్రజలందరూ కలిసి ఈ పండుగను కుటుంబ సభ్యులతో సంతోషకరంగా జరుపుకోవాలని ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఈ పండుగ జరగాలని చెప్పి కోరుకుంటూ ఈ పీస్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఏరియాలో పెడుతున్నటువంటి వినాయకుని ప్రతిష్టించే ప్రదేశంలో CC కెమెరాలు ఉండే విధంగా కమిటీ చూసుకోవాలని చెప్పి వారిని కోరడం జరిగింది. ఈ కమిటీ మొత్తం మణుగూరు మున్సిపాలిటీ మరియు మండలాల నుంచి ఒక 30 మంది అన్ని మతస్తులు పాల్గొనడం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ కార్యక్రమాలు జరగకుండా కమిటీ వారు పూర్తి బాధ్యతలు తీసుకొని పండుగలను విజయవంతం చేసి అందరూ సంతోషకరమైన వాతావరణంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.