- మా కష్టాలను గట్టెక్కిస్తున్న కేసీఆర్ కు మేము ఎప్పుడూ రుణపడి ఉంటాం
- గృహలక్ష్మి పథకం నాయి బ్రాహ్మణులకు అందేలా విప్ రేగా కాంతారావు చూడాలంటూ వర్కింగ్ ప్రెసిడెంట్ జగదీష్ కు వినతి పత్రం
మహానది న్యూస్ ,బూర్గంపహాడ్ , సెప్టెంబర్ 16 శనివారం ప్రపంచ క్షౌరవృత్తిదారుల దినోత్సవం సందర్భంగా… తెలంగాణ నాయి బ్రాహ్మణ సంఘం.. బూర్గంపహాడ్ మండల కమిటీ ఆధ్వర్యంలో సారపాక సెంటర్లో జెండా ఆవిష్కరించారు.. అనంతరం కమిటీ సభ్యులు. బూర్గంపహాడ్ మండల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్ ని మర్యాద పూర్వకంగా కలిసి… ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం తమ నాయిబ్రాహ్మణుల పట్ల పెద్ద మనసుతో ప్రతి నెల 250 యూనిట్లు కరెంటు ఉచితంగా అందజేయడమే కాకుండా చేతివృత్తుల వారికి సాయం కింద లక్ష రూపాయలు సహాయం అందించడం చాలా సంతోషంగా ఉందని..ఇంత మంచి పనులు చేస్తున్న కేసీఆర్ కి తాము ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని తెలియజేశారు…అలాగే నాయి బ్రాహ్మణుల్లో ఇల్లు లేని పేదలకు.. *ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే, జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు రేగా కాంతారావు. పెద్ద మనసుతో గృహలక్ష్మి పథకం కింద ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు ఉప్పెర్ల సీతారాములు, ప్రధాన కార్యదర్శి ఎం నరసింహారావు, వైస్ ప్రెసిడెంట్ నంద్యాల ఏడుకొండలు,కార్యదర్సి వల్లోజు శ్రీను, కోశాధికారి దడిగల నాగేశ్వరరావు,గౌరవ అధ్యక్షులు ఉప్పెర్ల అన్నారావు, ఆర్గనైజర్స్ రమణయ్య, నాగయ్య మరియు పలువురు సభ్యులు పాల్గొన్నారు..