తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన,తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ.

తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారు.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే హామీలు అమలు..

కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీ పథకాల కార్డులను ఆవిష్కరించిన ఎమ్మెల్యే పొదెం వీరయ్య. ఇంఛార్జ్ ఆవుల రాజీ రెడ్డి

ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం, మణుగూరు మండలంలోనీ హనుమాన్ ఫంక్షన్ హాల్ నందు మండల అధ్యక్షులు పీరినాకి నవీన్  ఆధ్వర్యంలో టి.పి.సి.సి సభ్యులు,నియోజకవర్గ కన్వీనర్ డాక్టర్.చందా సంతోష్ కుమార్  అధ్యక్షతన ఆదివారం నాడు తుక్కుగూడలో జరిగిన విజయభేరీ భారీ బహిరంగ సభ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ  తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని 6 గ్యారంటీ పధకాలను ప్రకటించడం జరిగింది, వీటిని తెలంగాణ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలలో గడప గడపకు తెలియజేయాలనే ఉద్దేశ్యంతో ఈ యొక్క ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొని 6 గ్యారెంటీ స్కీములతో కూడిన అభయహస్తం కరపత్రాన్ని విడుదల చేసిన ఏ.ఐ.సి.సి సభ్యులు, టి.పి.సి.సి సీనియర్ ఉపాధ్యక్షులు, భద్రాద్రి జిల్లా అధ్యక్షులు, భద్రాచలం శాసనసభ్యులు శ్రీ పొదెం వీరయ్య , మరియు పినపాక నియోజకవర్గ ఇన్చార్జి, టి.పి.సి.సి ప్రధాన కార్యదర్శి శ్రీ రాజిరెడ్డి .
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,
తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ  తెలంగాణ ప్రజల కోసం ప్రకటించిన 6 గ్యారెంటీ పథకలు,
1. మహాలక్ష్మి పథకం :-మహిళలకు నెలకు రూ. 2500 సాయం,రూ.500లకే గ్యాస్ సిలిండర్ ఆర్టీసీలో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత ప్రయాణం..
2. రైతు భరోసా:-రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి ఏటా రూ.15000 పెట్టుబడి సాయం రైతు కూలీలకు రూ. 12000 ఆర్థిక సాయం వరి పంటకు రూ. 500 బోనస్ ధర..
3.గృహజ్యోతి:-ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత కరెంట్..
4.చేయూత:-నెలకు రూ.4,000 పింఛన్ రూ. 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ బీమా..
5.ఇందిరమ్మ ఇండ్లు:-సొంత ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షలు సాయం,ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం కేటాయింపు..
6.యువ వికాసం:-విద్యార్థులకు రూ. 5 లక్షల విద్యా భరోసా కార్డు,ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్…
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అని,పేద బడుగు బలహీనవర్గాల ప్రజలకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని అన్నారు..
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఇచ్చినటువంటి హామీలను అమలు చేస్తామని తెలిపారు..
తెలంగాణ తల్లి శ్రీమతి సోనియా గాంధీ  తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే కాంగ్రెస్ పార్టీ కి గులాం గిరి చేస్తా అని చెప్పిన కేసిఆర్ ఈ మాట నిజం కాదా అనీ ప్రశ్నించారు..
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారెంటీ పథకాల గురించి కల్లబొల్లి మాటలు మాట్లాడుతున్న స్థానిక ఎమ్మెల్యే కాంతారావు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు, ప్రతి ఒక్క విషయంలో తల దూరుస్తే సహించేది లేదని హెచ్చరించారు..
కాంగ్రెస్ పార్టీలో గెలిచి, అధికార బిఆర్ఎస్ పార్టీకి అమ్ముడుపోయిన రేగ కాంతారావు నీకు కాంగ్రెస్ పార్టీని విమర్శించే అర్హత లేదన్నారు..
అదేవిధంగా వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తంచేస్తూ,ఇచ్చిన మాట ప్రతి ఒక్కటి నెరవేరుస్తామని హామీ ఇచ్చారు…

ఈ కార్యక్రమంలో టీ పి సి సి సభ్యులు తాళ్లూరి చక్రవర్తి శేకర్ , మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు  మైనారిటీ జిల్లా అధ్యక్షులు మహమూద్ ఖాన్  నియోజక వర్గం కో ఆర్డినేటర్ కాటిబోయిన నాగేశ్వర రావు, యూత్ అద్యక్షులు కోర్సా ఆనంద్  యూత్ జనరల్ సెక్రటరీ మిట్టపల్లి నితిన్ ,డి సి సి తుళ్ళూరి బ్రహ్మయ్య , వర్కింగ్ ప్రెసిడెంట్ సుధాకర్ రెడ్డి , బెల్లం కొండ వాసు దేవ , పినపాక నియోజక వర్గం ఏడు మండలాల అద్యక్షులు పీరినాకి నవీన్, గొడిషాల రామనాధం, సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్, ఓరుగంటి బీక్షమయ్య, దుర్గంపుడి కృష్ణా రెడ్డి,పాయం రామనర్శయ్య, ముత్యం చారి , బి బ్లాక్ మహిళా అ్యక్షురాలు బర్ల నాగమణి , నియోజకవర్గ నాయకులు, బట్టా విజయ గాంధీ, పోలెబోయిన శ్రీవాణి, కణితి కృష్ణా,ముద్ద రాజు,  సీనియర్ నాయకులు గాదె కేశవ రెడ్డి

, మహిళలు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు..

0Shares

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *