మణుగూరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తా పినపాక నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి పాల్వంచ. దుర్గా
మహానది న్యూస్ , మణుగూరు , సెప్టెంబర్ 20, మణుగూరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో అవుట్ సోర్సింగ్ లో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికులు సమస్యలు పరిష్కారం కోసం కృషి చేయాలని కోరడం జరిగింది. గత ఐదు నెలలు నుంచి జీతభత్యాలు లేక ఈ పీ ఎఫ్, ఈ ఎస్ ఐ గుర్తింపు కార్డు లేక అనేక ఇబ్బందులు పడుతున్నాం. రేక అడితే డొక్కాడని పరిస్థితిలో ఫారెస్ట్ ఆల్సోర్సింగ్ కాంటాక్ట్ కార్మికులకు జీతాలు రాక నాన్న ఇబ్బందులు పడుతున్నారు. రోజురోజుకు ఖర్చు విపరీతంగా పెరుగుతుంది ఐదు నెలల నుండి జీతం రాకపోవడంతో కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఉన్నది. బుధవారం పినపాక స్వతంత్ర అభ్యర్థి పాల్వంచ దుర్గని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అవుట్ సోర్సింగ్ కాంటాక్ట్ కార్మికులు రథం గుట్టు కలసి మాకు న్యాయం చేయాలని కోరారు మీ సమస్యలు పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు పినపాక నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న పాల్వంచ దుర్గా..