మహానది న్యూస్ , మణుగూరు, సెప్టెంబర్ 23.09.2023 , భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు’ లోనీ గిరిజన భవన్ నందు బిజెపి రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ బిజెపి ముఖ్యనాయకులతో కార్యకర్తలతో సమావేశం. తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ మాటల ప్రభుత్వం తప్ప చేతల ప్రభుత్వం కాదని విమర్శించారు.ప్రతి గ్రామంలో డబల్ బెడ్ రూమ్లు నిర్మించి ప్రతి వారికి ఇస్తానని నామమాత్రo నలుగురికి ఇచ్చారు మిగతా వాళ్ళకి లేవా? ఏమయ్యాయి డబ్బులు బెడ్ రూములు అనే ప్రభుత్వాన్ని నిలదీశారు. ఎంతో మంది విద్యార్థులు చదువుకొని ఉద్యోగాల కోసం పరీక్షలు రాస్తే వాటిని రద్దు చేస్తారా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే టీఎస్ పీఎస్సీ ఎగ్జామ్ వెంటనే నిర్వహించాలి అనీ డిమాండ్ చేశారు. పోడు పట్టాలిస్తానని చెప్పి నామమాత్రపు కొంతమందికి ఇచ్చి ఏళ్ల తరబడి పోడు చేసుకుంటున్న గిరిజనుల దగ్గర నుండి పొలాలు లాక్కుంటూ ఫారెస్ట్ అధికారులచే పోడు రైతులను కేసులపాలు చేస్తున్నారని ఇది సరైన పద్ధతి కాదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.తెలంగాణ రాష్ట్రంలో ప్రతి వీధిలో ప్రతి గ్రామంలో మద్యం ఏరులై పారుతూ భార్యాభర్తల మధ్య గొడవలు రేపుతూ కుటుంబాల్ని ఆగం చేస్తున్నారు అని ఆయన అన్నారు.58 ఏళ్లకే పెన్షన్ ఇస్తానని వాగ్దానం చేసి నేటికీ ఎటు పోయాయి ఆ పెన్షన్ నిరుపేదల కొత్తవి రేషన్ కార్డు రావా ఇంకెప్పుడు ఇస్తారు అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.మా బిజెపి ప్రభుత్వం వస్తే 55 ఏళ్లకే పెన్షన్ ఇస్తాము ఇంట్లో ఇద్దరు ముసలి వాళ్లు ఉంటే ఇద్దరికి కూడా ఇస్తాము. బిజెపి ప్రభుత్వాన్ని మీరందరూ ఆశీర్వదించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు మణుగూరు పట్టణం లోని గిరిజన భవనంలో బీజేపీ పార్టీ నియోజకవర్గ స్థాయి సమావేశం… జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యాతిది గా బిజెపి BJP ఎన్నికల కమిటి చైర్మన్ ఈటెల రాజేందర్ పాల్గొన్నారు..ఉమ్మడి ఖమ్మం జిల్లా పదినియోజకవర్గాల్లో ఐదు నియోజక వర్గాలు గిరిజన నియోజక వర్గాలని వీరంతా BJP అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని ఈటెల అన్నారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా , మణుగూరు లో బీజేపీ నియోజకవర్గ సమావేశానికి హాజరైన ఈటెల రాజేందర్ మాట్లాడుతూ… ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రజలను మరోసారి మోసం చేయడానికి సిద్ధమయ్యారని ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. మాయల గారడి చేసి మభ్యపెట్టి ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని ప్రజలు గమనించాలన్నారు. కెసిఆర్ 10 ఏండ్ల పాలనలో నీరు పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇచ్చిన పాపను పోలేదు, రాష్ట్రంలో వైద్యం, విద్య ను భ్రష్టు పట్టించడాని రాత్రి పగలనకా కష్టపడి చదువుకొని పరీక్షలు రాస్తే ప్రశ్న పత్రాలను లీకేజీలు చేసి విద్యార్థులను జీవితాల తో చలగాటం ఆడిన ఏకైక ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అని విమర్శించారు. రాష్ట్రంలో పేదవాడికి అర్ధరాత్రి వైద్యం అందడం లేదుకాని తెల్లవార్లు ఎక్కడ చూసినా మద్యం ఏరులై పారుతుందని అన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు ప్రభుత్వ భూములు ,దేవాలయ భూములు , అవుట్డోర్ రింగ్ రోడ్డు ని అమ్మి వేల కోట్ల రూపాయల దోచుకున్నాడని ఆ డబ్బుతోటే ఎలక్షన్లలో గెలవాలని చూస్తున్నాడంటూ బి ఆర్ ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.. పోడు రైతులకు పట్టాలు పంచడంలో కెసిఆర్ ప్రభుత్వం విఫలమైందన్నారు. రాబోవు ఎన్నికల్లో బిజెపి అధికాంలోకి వస్తె 50 ఏళ్లు దాటిన దంపతులు ఇద్దరి కి పెన్షన్ ఇస్తామని , పెల్లిపందిరిలోనే కల్యాణలక్ష్మి చెక్కు అందజేస్తాం అన్నారు. బిజెపి అధికారంలోకి వస్తే నాణ్యమైన ప్రభుత్వ విద్యా, వైద్యం అందిస్తాం అన్నారు.