స్వచ్ఛభారత్ నిర్వహించిన సిఆర్పిఎఫ్ 212
మహానది న్యూస్ ,భద్రాచలం అక్టోబర్ 2 : భారతదేశంలో అతి ముఖ్యమైన కార్యక్రమంలో ఒకటైనటువంటి స్వచ్ఛభారత్ కార్యక్రమం ప్రారంభించి నేటికి తొమ్మిది సంవత్సరాలు కావస్తున్న సందర్భంగా 9వ వార్షికోత్సవం పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలంలోని నెల్లిపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిఆర్పిఎఫ్ 212 బెటాలియన్ ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. బెటాలియన్ కమాండెంట్ శ్రీవాత్సవ సెకండ్ కమాండెంట్ బెటాలియన్ దినేష్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో 320 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆసుపత్రి ప్రాంగణమంతా పిచ్చి మొక్కలతో నిండి ఉండడంతో 212 సిఆర్పిఎఫ్ బెటాలియన్ ఆధ్వర్యంలో ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ప్రాంగణమంతా దాని పరిసరాలు మొత్తం శుభ్రం చేసే కార్యక్రమం నిర్వహించారు. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని ఇది ఎంతో సత్ఫలితాలను ఇచ్చిందని ఈ సందర్భంగా తెలిపారు