ఆర్ఓఎఫ్ఆర్, ఎల్టీఆర్, పిసా చట్టాలపై అవగాహన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి | ఐటిడిఏ పిఓ ప్రతీక్ జైన్
మహానది వెబ్ న్యూస్ , అక్టోబర్ ,05-2023,కొత్తగూడెం, ఆర్ఓఎఫ్ఆర్, ఎల్టీఆర్, పిసా చట్టాలపై అవగాహనకు నిర్వహించనున్న సమావేశంలో డిఆర్డీఓ, డిపిఓ, సహకార అధికారి, డివిషనల్ పంచాయతి అధికారులు,ఎంపిడివోలు, ఎంపివోలు, సర్పంచులు, గ్రామ కార్యదర్శులు, పిసా వైస్ ప్రెసిడెంట్స్ , సెక్రటరీస్ మొబలైజర్స్ పాల్గొని అవగాహన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఐటిడిఏ పిఓ ప్రతీక్ జైన్ తెలిపారు. 7వ తేదీ శనివారం ఉదయం 10 గంటలకు భద్రాచలం ఐటిడిఎ కార్యాలయ ప్రాంగణంలోని గిరిజన భవనంలో ఈ అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.ఈ అవగాహన కార్యక్రమంలో చట్టాల పట్ల విశేషమైన అనుభవమున్న సీనియర్ న్యాయవాది త్రినాదరావు ఆర్వోఎఫ్ఆర్, ఎల్ టి ఆర్, పిసా చట్టాల అమలుపై అమూల్యమైన న్యాయ సలహాలు, సూచనలు అందచేస్తారని ఆయన తెలిపారు. జిల్లా పరిధిలోని ఎపిడివోలు వారి వారి మండలాల పరిధిలోని ఎంపివోలు, సర్పంచులు, గ్రామ కార్యదర్శులకు, పెసా ప్రెసిడెంట్స్, వైస్ ప్రెసిసెంట్స్, పిసా కార్యదర్శులు, పిసా మొబలైజర్స్ కు ఈ అవగాహన సదస్సు సమాచారం అందించి ఈ సదస్సులో ప్రతి ఒక్కరూ పాల్గొనే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు.