ఓటర్లను చైతన్యపరచేందుకు కళాజాత బృందాల ద్వారా అవగాహన కార్యక్రమాలు | డిపిఆర్వో శీలం శ్రీనివాస్
మహానది వెబ్ న్యూస్, 8 నవంబర్ -2023: కొత్తగూడెం, ఓటర్లను చైతన్యపరచేందుకు కళాజాత బృందాల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు డిపిఆర్వో శీలం శ్రీనివాస్ తెలిపారు. బుధవారం కొత్తగూడెం తహసీల్దార్ కార్యాలయ పరిసరాలు, సింగరేణి హెడ్ ఆఫీస్, మున్సిపల్ కార్యాలయ పరిధి తదితర ప్రాంతాలాల్లో ఓటరు చైతన్య అవగాహన కళాజాత నిర్వహించినట్లు చెప్పారు. పోలింగ్ శాతాన్ని పెంచేందుకు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ప్రియాంక అల ఆదేశాల మేరకు ఓటరు చైతన్య కళాజాత నిర్వహించినట్లు చెప్పారు. 2018 సంవత్సరంలో జిల్లాలో 166 పోలింగ్ కేంద్రాలలో తక్కువ శాతం పోలింగ్ నమోదు అయినందున అట్టి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఓటరు చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు ప్రతి ఒక్కరూ ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా పవిత్రమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని, నూటికి నూరు శాతం ఓటింగ్ జరిగే విధంగా ప్రతి ఒక్కరు బాద్యతగా ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పారు. ఓటు హక్కు వినియోగంలో రాష్ట్ర స్థాయిలో మాన జిల్లాను ఆదర్శంగా నిలపాలని ఆయన చెప్పారు. పండుగ వాతావరణంలో ఓటింగ్ వినియోగించుకోవాలని చెప్పారు. ఈనెల 30వ తేదీన జరుగనున్న పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుందని కళాకారుల బృందాల ద్వారా అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో కొంపెల్లి బాలకృష్ణ, అలవాల కృపానందం,మిట్టపల్లి నరేందర్, ముత్తవరం ధనలక్ష్మి, గుగులోత్ నీల, షేక్ కౌసర్ తదితరులు పాల్గొన్నారు.