నూరుశాతం ఓటుహక్కు వినియోగంపై పార్కులు, బస్టాండ్లు, ప్రజా రద్దీ ప్రాంతాల్లో సెల్ఫీ పాయింట్లు|డాక్టర్ ప్రియాంక అల

మహానది వెబ్ న్యూస్,  8 నవంబర్ -2023: కొత్తగూడెం, నూరుశాతం ఓటుహక్కు వినియోగంపై పార్కులు, బస్టాండ్లు, ప్రజా రద్దీ ప్రాంతాల్లో సెల్ఫీ పాయింట్లు ఏర్పాటు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి | తెలిపారు. ఓటుహక్కు వినియోగంపై బుధవారం ఐడిఓసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింటులో ఫోటో దిగారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఓటు హక్కు వినియోగంపై పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అందులో భాగంగానే రద్దీ ప్రాంతాలలో సెల్ఫీ పాయింట్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్, ఐటీఐ, ఇంజినీరింగ్, వైద్య తదితర కళాశాలల్లో సెల్ఫీ పాయింట్స్ ఏర్పాటు చేయాలని స్వీప్ నోడల్ అధికారిని ఆదేశించారు. పోలింగ్ తక్కువ జరిగిన కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగంపై కళాజాత కార్యక్రమాలు నిర్వహించాలని డిపిఆర్వోకు సూచించారు. అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు వారి సిబ్బందికి ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పించి అందరు ఓటు హక్కు వినియోగించాలని అవగాహన కల్పించాలని చెప్పారు. వారి వారి శాఖల పరిధిలో క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ మధుసూదన్ రాజు, డిపిఆర్ఓ శ్రీనివాస్, స్వీప్ నోడల్ అధికారి త్రినాథ్ బాబు, ఎస్సీ అభివృద్ధి అధికారి అనసూర్య, డిసిఓ వెంకటేశ్వర్లు, ఆడిట్ అధికారి వెంకటేశ్వర్ రెడ్డి, సిపిఓ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

0Shares

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *