చింతిరాల రవికుమార్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే పొదేం వీరయ్య, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ
మహానది న్యూస్, భద్రాచలం ప్రతినిది , 15.11.2023 , ఎస్సీ సెల్ డిపార్ట్మెంట్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు చింతిరాల రవికుమార్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే పొదేం.వీరయ్య మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ,సీపీఐ నాయకులు రావులపల్లి రవికుమార్ భగవాన్ దాస్ కాలనీ,అశోక్ నగర్ కాలనీ ,కొత్త,కాలనీ లలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పొదెం వీరన్న గెలుపుతో భద్రాచలం అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని రాష్ట్రంలో రాబోయేది కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా భద్రాచలం శాసనసభ్యులు,కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొదెం వీరయ్య భగవాన్ దాస్ కాలనీ,అశోక్ నగర్ కాలనీ ,కొత్త,కాలనీ లలో నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జరిగింది. ముందుగా చర్ల రోడ్డులో గల శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేకంగా పూజలు నిర్వహించడం జరిగింది. అనంతరం పార్టీ నాయకులతో కలిసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వీరయ్య గారు గడప,గడపకు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను వివరిస్తూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించడం జరిగింది. 100 కోట్లు, 1000 కోట్లు అంటూ, భద్రాచలం రామయ్య ను, భద్రాచల నియోజకవర్గ ప్రజలను మోసం చేసిన సీఎం కేసీఆర్ ను గద్దెదించేందుకు భద్రాచల నియోజకవర్గ ప్రజలు నడుం బిగించి, భద్రాచల ప్రాంతం నుంచే వారి ఓటమికి తొలి అడుగు వేయాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.ఈనెల 30వ తారీఖున జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబడుతున్న నా ఎన్నికల గుర్తు హస్తం గుర్తుపై ఓటు వేసి నన్ను గెలిపించాలని ఆయన అన్నారు.