• కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొదెం వీరయ్య కి పెరుగుతున్న జనాధారణ చూసి ఓర్వలైకే బి.ఆర్.ఎస్ నాయకులు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు.
  • కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొదెం వీరయ్య.మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ.
  • స్వచ్ఛందంగా ప్రజలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు,అది చూసి బి.ఆర్.ఎస్ నాయకులకు మతిభ్రమించి మాట్లాడుతున్నారు.పది సంవత్సరాల్లో అభివృద్ధి ఎందుకు చేయలేదని,బి.ఆర్.ఎస్ నాయకులను ప్రతి చోట నిలదీస్తున్న ప్రజలు,ప్రజల ఓట్లు ఎలా అడగాలో తెలియకనాపై బురద జల్లుతున్నారు.భద్రాచల శాసన సభ్యులు,కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొదెం వీరయ్య. 

మహానది న్యూస్, భద్రాచలం ప్రతినిది , 15.11.2023,  ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో భద్రాచల శాసనసభ్యులు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొదెం వీరయ్య మాట్లాడుతూ.పది సంవత్సరాల లో బి.ఆర్.ఎస్ పార్టీ భద్రాచల ప్రాంత సమస్యలను గాలికి వదిలేసి,100 కోట్లు, 1000 కోట్లు అని భద్రాచల రామయ్యను, భద్రాచల ప్రజలను చేసిన మోసం ప్రజలందరికీ అర్థమైంది.సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ ఏం మండలానికి ప్రచారానికి వెళ్లిన ప్రజలందరూ 10 సంవత్సరాలలో ఈ ప్రాంతానికి మీరు ఏం చేశారని ఓట్లు అడుగుతున్నారని తిరగబడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అయితేనే భద్రాచల ప్రాంత సమస్యలను తీరుస్తుందని ప్రజల నమ్మి విశ్వసించి కాంగ్రెస్ పార్టీలో స్వచ్ఛందంగా చేరుతున్నారని.కాంగ్రెస్ పార్టీకి వస్తున్న జనాధారణ చూసి విఆర్ఎస్ నాయకులకు మతిభ్రమించి, ఏమి చేయాలో పాలు పోక, నాపై బురదజల్లే ప్రయత్నం చేస్తూ ప్రజలను మోసం చేసి ఓట్లు దండుకోవాలని చూస్తున్నారు అని, మీరు నాపై వేసే నిందలు నిజమా అబద్ధాల మీ విజ్ఞతకే వదిలేస్తున్నానని వీరయ్య మాట్లాడారు.అనంతరం బాలసాని లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.నాపై కానీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్న వీరయ్య పై గానీ అణిచిత వ్యాఖ్యలు చేయటానికి ఎమ్మెల్సీ తాతా మధుకి అర్హత లేదని. నిన్ను ఈ సార్వత్రిక ఎన్నికలకు భద్రాచల నియోజకవర్గం ఇన్చార్జిగా వేస్తే, నువ్వే అభ్యర్థులు లాగా ఫీల్ అవుతూ వెంకట్రావుని తోలుబొమ్మను చేసి ఆడుకుంటున్నావని. వీరన్న స్థానికుడు కాదని చెప్పే నువ్వు, కొన్ని రోజుల క్రితమే అమెరికా నుంచి వచ్చి బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ పదవి వెలగబెడుతున్నావు తప్ప నువ్వు ఈ ప్రాంతం వాడివా అని,నీకు ఈ ప్రాంతంలో ఎక్కడ ఏ ప్రాజెక్టు ఏ టైం లో నిర్మించారో తెలియదు,కనీసం భద్రాచలం యొక్క మూలాలు కూడా తెలియని వ్యక్తివి నువ్వు అని అన్నారు.ఎమ్మెల్సీ పదవుల్లో ఉండి ఏ రోజైనా భద్రాచల ప్రాంత సమస్యలపై సీఎం కేసీఆర్ దగ్గర నోరు తెరిచావా, ఈరోజు ఎన్నికల ఇన్చార్జిగా వచ్చి ఈ ప్రాంతానికి మా అభ్యర్థిని గెలిపిస్తే అది చేస్తాం ఇది చేస్తామని మాయమాటలు చెప్పుకుంటూ తిరుగుతున్నావు.మీ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు సవాలు విసురుతున్న, మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఈ ప్రాంతంలో మీరు చేసిన అభివృద్ధి గురించి గానీ, రామాలయానికి ఇక్కడి ప్రజలకు మీరు చేసిన మంచే ఏదైనా ఉంటే ఆ విషయాలను ప్రజలకు వివరించి ఓట్లు అడగాలని.అంతేగాని వ్యక్తిగతంగా విమర్శించి బురద జల్లి, మాయమాటలతో ప్రజలను మోసం చేసి ఓట్లు దండుకుందామంటే ప్రజలు ఇంకా మీ చేతుల్లో మోసపోవడానికి సిద్ధంగా లేరని.దళిత బంధు విషయంలో సాక్షాత్తు మీ అధినాయకుడు సీఎం కేసీఆర్ ఏ నీ బి.ఆర్.ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే వసూళ్లకు పాల్పడ్డారని పత్రికాముఖంగా బహిర్గతంగా చెప్పారు..ఇక్కడి కొత్తగూడెం నియోజకవర్గం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పై, ఒక వికలాంగుడు సైతం మూడు లక్షల రూపాయలు ఇస్తేనే దళిత బంధు ఇస్తారా అంటూ బి ఆర్ ఎస్ ప్రచార రథం ని ఆపిన విషయాలు మీకు కనబడటం లేదా. మీరు మా కాంగ్రెస్ పార్టీ నాయకులపై విమర్శలు చేస్తుంటే దొంగే దొంగ అన్నట్టుగా ఉంది.మీకు ఒకటే చెప్పదలుచుకున్నాం మీరు మాపై ఒక్క వేలు చూపిస్తే, మీ వైపు చూపిస్తాయి, మీరు మమ్మల్ని విమర్శించేంత శుద్ధపూసలేం కాదని విమర్శలు చేశారు.మీకు ఒకటే సవాలు విసురుతున్నాం భద్రాచలానికి ఎన్ని నిధులు తీసుకువచ్చి ఇక్కడ ఏ అభివృద్ధి పనులు చేశారో దమ్ము ధైర్యం ఉంటే అభివృద్ధి విషయంలో చర్చికి రావాలని,ప్రజల్లోకి వెళ్లి చర్చించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు.సిపిఐ నాయకులు రావులపల్లి రవికుమార్ మాట్లాడుతూ.సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా సిపిఐ పార్టీ కాంగ్రెస్ పార్టీతో ఈ ఎన్నికల్లో పొత్తుల్లో ముందుకు వెళుతుందని. పోయిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వీరయ్య విజయంలో సిపిఐ పార్టీ కీలక భూమిక పోషించిందని..ఈసారి కూడా మా పార్టీ సిద్ధాంతాలకు మా పార్టీ సూచనల మేరకు వీరయ్య విజయంలో కీలకపాత్ర పోషిస్తామని.కొంతమంది మా పార్టీని వీడి ఇంకా సిపిఐ పని అయిపోయింది సిపిఐ లో ఉన్న వాళ్ళందరూ కూడా టిఆర్ఎస్ పార్టీకే పని చేస్తారని చెప్పుకోవడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని.ఎర్రజెండా ఎప్పుడు రెపరెపలాడుతుంది తప్ప నేలకొరకే సమస్య లేదని, పార్టీ పని అయిపోయిందని చెప్పి విమర్శలు చేసే వారికి బుద్ధి చెప్పే విధంగా సిపిఐ పార్టీ వీరయ్య ని గెలిపించి మా సత్తా ఏంటో చూపిస్తామని సవాల్ విసిరారు.ఈ పత్రికా సమావేశంలో. టిపిసిసి సభ్యులు బుడగం శ్రీనివాస్,ఎల్డిఎం కోఆర్డినేటర్ నల్లపు దుర్గాప్రసాద్,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సరెళ్ళ నరేష్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు చింతరేల రవికుమార్, టిడిపి నాయకులు ఎస్కే అజిమ్,కోనేరు రాము కుంచాల రాజారాం,సిపిఐ నాయకులు రావులపల్లి రవికుమార్ కల్లూరు వెంకటేశ్వర్లు,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బలుసు నాగ సతీష్, దొడ్డిపట్ల సత్య లింగం,ఎన్.ఎస్.యు.ఐ నియోజకవర్గ అధ్యక్షులు సరెళ్ళ వెంకటేష్,యూత్ కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు చింతరెల సుధీర్, యూత్ కాంగ్రెస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎడారి ప్రదీప్, తమ్మల్ల వెంకటేశ్వర్లు,రాగం సుధాకర్,ఎండి జిందా, దొడ్డిపట్ల కోటేష్,చెంచు సుబ్బారావు, వరుణ్, సోషల్ మీడియా సిద్ధి గణేష్ తదితరులు పాల్గొన్నారు.

0Shares

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *