లక్షకోట్ల అవినీతి సొమ్ము కక్కిస్తాం.. మణుగూరు కార్నర్ మీటింగ్ లో రాహుల్ గాంది ..
మహనది వెబ్ న్యూస్, (మణుగూరు ప్రతినిది): 17 నవంబర్,23: పినపాక నియోజకవర్గ కాంగ్రెస్స్ పార్టీ అభ్యర్ధి పాయం వెంకటేశ్వర్లు ప్రచార సభ స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో పాల్గొని రాహుల్ గాంధి ప్రసంగించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… బి.ఆర్.యస్ పార్టీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఆయన ఎండగట్టారు. తొలుతదూర ప్రాంతాల నుండి వచ్చిన వారందరికీ, ఎండలో ఉండి ఎదురు చూస్తున్న అందరికి వందనాలు అంటూ ప్రసంగం ప్రారంభించారు. రాజకియం నాకు సంబంధం కాదు… నా రక్త సంబంధం అన్నారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్. తెలంగాణలో కాంగ్రెస్ అనేక నిర్మాణాలు చేసి అభివృద్ధి చేసిందని, దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్య పోరాటం జరుగుతుందని అన్నారు. ఏ మంత్రి వర్గంలో డబ్బులు ఎక్కువ ఉన్నాయో అవన్నీ కేసి ఆర్ కుటుంబం వద్దే ఉన్నాయని ఆరోపించారు. కె సి ఆర్ అవినీతి తెలంగాణ మొత్తం ఉన్నదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల మోసం చేసారనే విషయాన్ని ప్రజలకు వివరించమన్నారు. ఎక్కడెక్కడ కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఉన్నారో, కాబోతున్నారో తెలంగాణలో కూడ లక్షల కోట్లు అవినీతికి కాకుండా ప్రజల కోసం ఖర్చు పెడ్తామన్నారు. బి.ఆర్.యస్. పార్టీ దోచుకున్న లక్షల కోట్ల అవినీతి సొమ్ము కక్కిస్తామన్నారు. కాంగ్రెస్ 6 గ్యారంటీలు ఇస్తుందన్నారు. ఇప్పుడు 1200 ఉన్న గ్యాస్ సిలెండర్ కొద్ది రోజులలో 500 కె వస్తుందన్నారు. ప్రతి మహిళకు నెలకు 2500 ఇస్తామన్నారు. మహిళకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక బస్ లలో టికెట్ లేకుండా ఫ్రీ గా ప్రయాణించవచ్చని అన్నారు. రైతులకు ఎకరాకు 15000 పంట సాయమిస్తామని అన్నారు. 200 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇస్తామన్నారు. ఇందిరమ్మ ఇండ్లకు ప్రతి ఒక్కరికి 5 లక్షలు ఇస్తామన్నారు. యువ వికాసం కింద విద్యార్థులకు 5 లక్షలు ఇస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గ్యారంటీలాన్ని అమలు చేయించే బాధ్యత తనదన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత జాతీయ కుల గణన చేస్తామన్నారు. రీజర్వేషన్ కోట పెంచుతామన్నారు. వేల కోట్లతో లోకల్ ఉద్యోగాలు మీకు రానున్నయ్యన్నారు. వచ్చే ప్రభుత్వం కుటుంబ ప్రభుత్వ కాదని ప్రజల ప్రభుత్వం అన్నారు. ధరణి పేరుతో 24 లక్షల మంది రైతులను మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ వస్తే ఎస్ సి లకు, ఎస్ టి లకు, ఓ బీసీ లకు మీ భూములు మీకు ఇస్తామన్నారు. తెలంగాణ లో తుఫాన్ వస్తుందన్నారు. చేతి ఊపుకు కేసి ఆర్, అతని పార్టీ కొట్టుకు పోతుందన్నారు. కాంగ్రెస్ వాగ్దానము ఇచ్చింది, తెలంగాణ వచ్చింది. కె సి ఆర్, నరేంద్ర మోదీ లా అబద్దపు మాటలు కాంగ్రెస్ వద్ద లేవన్నారు. బీజేపీ, ఏం ఐ ఏం, బి ఆర్ ఎస్ అన్నదమ్ములన్నారు. ఇక్కడ బి ఆర్ ఎస్ అక్కడి బి జె పి కి మద్దతు ఇస్తుందన్నారు. ఇక్కడ బి ఆర్ ఎస్ ను, అక్కడ మోదీ ని ఊడ్చి వేయాలన్నారు. మండు టెండలో ఇప్పటి వరకు వేచి ఉన్న ప్రియమైన ప్రజలారా హస్తం గుర్తుకు ఓటు వేయమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానన్నారు.