బాపనకుంట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ 77వ పుట్టినరోజు వేడుకలు
మహానది వెబ్ న్యూస్, మణుగూరు ప్రతినిది ,09.12. 023: మణుగూరు టౌన్ బాపనకుంట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ 77వ పుట్టినరోజు వేడుకలు బాపన కుంటలో ఘనంగా నిర్వహించారు బాపన కుంట గ్రామ అధ్యక్షులు తేలే బాలకృష్ణ మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మ పుట్టినరోజు కానుకగా తెలంగాణ రాష్ట్రాన్ని అధికారం ఇవ్వడం జరిగింది అన్నారు. సోనియమ్మ పుట్టినరోజు నాడే ఆరు గ్యరెంటి ల లో రెండు గ్యరెంటి లు మన తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేయడం ద్వరా రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య సాయం 5 లక్షల నుండి 10 లక్షలకు పెంచడం వల్ల పేదలందరికి ఉచితంగా కార్పోరేట్ వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని అలాగే రాష్ట్రంలోని మహిళలకు ఉచిత ప్రయాణ మహాలక్ష్మి పథకాలను అమలు చేయడం తెలంగాణా ప్రజల అదృష్టం అన్నారు . ఈ కార్యక్రమంలో తేల కృష్ణ. సుజాత. పుట్టి రమణమ్మ.. పచ్చిపాల శ్రీను. కన్నెగంటి హేమ తదితరులు పాల్గొన్నారు