మార్చి 14 వరకు ఛాన్స్….

అర్హులైన పట్టభద్రుల నుంచి మార్చి 14వ తేదీ వరకు కూడా దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ఈసీ తెలిపింది. వీటిని కూడా పరిష్కరిస్తామని పేర్కొంది. గడువు ముగిసినప్పటికీ.. కొత్త దరఖాస్తులను స్వీకరిస్తున్నామని సీఈవో వికాస్‌రాజ్‌ వివరించారు. కొత్తగా వచ్చే దరఖాస్తులను తుది ఓటర్ల జాబితా ప్రకటించే నాటికి పరిష్కరిస్తామన్నారు. అర్హులైన ఓటర్లు ఫాం-18ని నింపాలని సూచించారు. ఆన్ లైన్ కాకుండా ఆఫ్ లైన్ లోనూ దరఖాస్తులను పూర్తి చేయవచ్చని సూచించారు.

అర్హతలు – కీలక సూచనలు

గతంలో ఓటు హక్కు ఉన్నప్పటికీ… మళ్లీ నమోదు చేసుకోవాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

డిగ్రీ ఉత్తీర్ణులై 2023 నవంబరు 1వ తేదీ నాటికి మూడేళ్లు పూర్తయిన వారు ఓటు నమోదుకు అర్హులు అవుతారు.

ఆఫ్ లైన్ లో అంటే తహసీల్దార్‌, ఆర్డీవో, కలెక్టరేట్‌ కార్యాలయాల్లో పూర్తి చేసిన దరఖాస్తులను సమర్పించవచ్చు.

డిగ్రీ పూర్తిచేసిన వారు ప్రొవిజినల్‌ సర్టిఫికెట్‌ లేదా మార్కుల ధ్రువపత్రం, లేదా డిగ్రీ పట్టా నకలు పత్రాలు దరఖాస్తుకు జత చేయాలి. అదేవిధంగా ఒరిజినల్‌ పత్రాలను చూపించి నకలు పత్రాలపై అధికారి సంతకం చేయించుకోవాలి.

ఓటరు గుర్తింపు కార్డు, ఆధార్‌ కార్డు, చిరునామా ధ్రువపత్రాలు రెండు పాస్‌పోర్టు ఫొటోలు జత చేయాలి.

దరఖాస్తు చేయుటకు కావలసిన డాక్యుమెంట్స్ :

1.Passport size photo
2. Degree Long Memo
3. Date of Birth
4. Voter Id Number
5. Aadhar Number
6. Mobile No
7. Mail Id

0Shares

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *