నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ఫెబ్రువరి 20న ఉపన్యాస పోటీలు

నెహ్రూ యువ కేంద్ర జాతీయ యువజన పార్లమెంటు ఉత్సవాల్లో భాగంగా జాతీయ స్థాయి ఉపన్యాస పోటీలను నిర్వహిస్తోంది.ఈ పోటీలను కొన్ని జిల్లాల వారిగా విభజించి అందులో ఖమ్మం, వరంగల్, హైదరాబాద్ ఉమ్మడి జిల్లాల కేంద్రాలకు కలిపి నెహ్రూ యువ కేంద్ర ఖమ్మం ఆన్లైన్ ద్వారా ఈ పోటీలను నిర్వహిస్తోంది.ఈ పోటీల్లో విజేతలు రాష్ట్రస్థాయికి ,రాష్ట్రస్థాయిలో గెలిచినవారు జాతీయస్థాయి పోటీలకి ఎంపిక అవుతారు.జాతీయ స్థాయిలో గెలుపొందిన వారికి మొదటి బహుమతి రెండు లక్షల నగదు, రెండో బహుమతి 1,50,000 ,మూడవ బహుమతి లక్ష రూపాయలు, ప్రోత్సాహక బహుమతులు ఇద్దరికీ 50 వేల చొప్పున ఇవ్వబడతాయి.
పోటీలో పాల్గొనడానికి అర్హతలు :-
1. ఫిబ్రవరి 01, 2024 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉండాలి.
2. మై భారత్ అనే కేంద్ర ప్రభుత్వ పోర్టల్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు మాత్రమే అర్హులు
ఉపన్యాస అంశాలు :-
1. భారత్ ను ప్రపంచ స్థాయి నాయకత్వ దేశంగా నిలబెట్టడం మరియు ఆర్ధిక శక్తిని పెంచడంలో యువ పారిశ్రామికవేత్తల పాత్ర (Making India a global leader: the role of an entrepreneurs in boosting India’s economic power).
2.ఆత్మ నిర్భర్ భారత్ నుంచి వికసిత్ భారత్ వైపు మన దేశ ప్రయాణంలో యువత పాత్ర (from Atmanirbhar to Viksit Bharat: Charting India’s growth trajectory powered by youth)
3. భవిష్యత్తును శక్తివంతం చేయడం, బాధ్యతాయుతమైన సమాజానికి మార్గం సుగమం చేసే యువత నేతృత్వంలోని కార్యక్రమాలు(Empowering the Future: Youth-led initiatives paving the way for a responsible community).
● జిల్లా స్థాయి మరియు రాష్ట్రస్థాయి పోటీలలో అభ్యర్థులు తెలుగు హిందీ లేదా ఇంగ్లీషులో మాట్లాడవచ్చును. రాష్ట్రస్థాయి పోటీలలో గెలుపొందిన అభ్యర్థులకు పార్లమెంట్లో మాట్లాడే అవకాశం ఉంటుంది.
● జాతీయ స్థాయి పోటీలో పాల్గొనే అభ్యర్థులు హిందీ లేదా ఇంగ్లీషులో మాత్రమే మాట్లాడాలి. న్యాయ నిర్ణేతల యొక్క నిర్ణయమే తుది నిర్ణయం.
● న్యాయ నిర్ణేతలు సూచించిన నిడివిలోనే మాట్లాడాలి అలాగే పైన సూచించిన అంశాలకు సంబంధించిన ఉపన్యాసం మాత్రమే ఇవ్వాలి.
పోటీలలో పాల్గొనదలచిన ఖమ్మం, భద్రాచలం, వరంగల్, హన్మకొండ, ములుగు, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, జనగాం మరియు హైదరాబాద్ జిల్లాల అభ్యర్థులు ఫిబ్రవరి 19వ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు ఈ కింద ఇవ్వబడిన లింక్ www.mybharat.gov.in ద్వారా వారి వారి జిల్లాకు సంబంధించిన పోటీలకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.ఈ పోటీలు 20 ఫిబ్రవరి 2024 ఉదయం 11 గంటలకు ఆన్లైన్ ద్వారా నిర్వహించబడతాయి.
ఇతర వివరాలకు నెహ్రూ యువ కేంద్ర వాలంటీర్ ను 9390831502 ఆఫీసు సమయాల్లో సంప్రదించవచ్చు.

0Shares

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *