-
ఉత్సాహభరితంగా ఐఎఫ్ డబ్ల్యూజే సమావేశాలు
-
దేశవ్యాప్తంగా పాల్గొన్న ప్రతినిధులు
-
తెలంగాణ నుంచి 60 మంది టిడబ్ల్యూజేఎఫ్ ప్రతినిధులు
మహానది న్యూస్ మథుర/ఉత్తర ప్రదేశ్, సెప్టెంబర్ 29: ఉత్తరప్రదేశ్ లోని మధుర బృందావన్ లో గల వ్రిందా ఆనంద్ రిసార్ట్స్ లో రెండు రోజుల పాటు జరిగే ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్( ఐఎఫ్ డబ్ల్యూజే) 77వ జాతీయ కౌన్సిల్ సమావేశాలు ఉత్సాహభరితంగా ప్రారంభమయ్యాయి. ఆదివారం జరిగిన సెషన్ లో కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ముఖ్యఅతిథిగా హజరై జ్యోతి ప్రజ్వలన చేసి సమావేశాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమాజంలో పాత్రికేయుల పాత్ర చాలా గొప్పదని, సమాజం శ్రేయస్సు కోసం మరింత కృషి చేయాలని అన్నారు. ఐఎఫ్ డబ్ల్యూజే జాతీయ అధ్యక్షుడు కే.విక్రమ్ రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సెక్రటరీ జనరల్ విపిన్ దులియా, నేషనల్ కాన్ఫడరేషన్ ఆఫ్ న్యూస్ పేపర్స్,ఎజెన్సీస్ ఎంప్లాయీస్ యూనియన్స్ అధ్యక్షుడు ఇందుకాంత్ దీక్షిత్, ఐఎఫ్ డబ్ల్యూజే కార్యదర్శి(తెలంగాణ) పులిపలుపుల ఆనందం తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా సమావేశంలో పాల్గొన్న తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ కు శాలువా కప్పి ఫెడరేషన్ మెమొంటోను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండి విజయ కుమార్, కార్యదర్శులు కర్రా అనిల్ కుమార్, రాజశేఖర్ తదితరులతో పాటు వివిధ జిల్లాల నాయకులు పాల్గొన్నారు.అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి టిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కర్ర అనిల్ రెడ్డి తో పాటు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పూదోట సూరిబాబు, గుండెబోయిన వెంకటేశ్వర్లు కేరళ రాష్ట్ర గవర్నర్ కు భద్రాచలం రామయ్య లడ్డూ ప్రసాదం అందజేసి రామయ్య ఉత్తరేణి కప్పి ఘనంగా సన్మానించారు. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం రామయ్య ఆలయ చరిత్ర తనకు తెలుసునని ఈ సందర్భంగా గవర్నర్ తెలిపారు. ఈ సమావేశంలో వివిధ రాష్ట్రాల నుంచి దాదాపు 600 మంది జర్నలిస్టు ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రారంభ సమావేశం అనంతరం ఆయా రాష్ట్రాల ప్రతినిధులు స్థానిక జర్నలిస్టుల సమస్యలను ప్రస్తావించారు. జర్నలిస్టుల రక్షణ చట్టం, పెన్షన్ స్కీం, డిజిటల్, సోషల్ మీడియా సమస్యలు తదితర అంశాలపై సుదీర్ఘ చర్చ జరిగింది.