భద్రాద్రి కొత్తగూడెం: మైనారిటీలకు గ్రూప్-2 మాక్ టెస్టుల కోసం అప్లికేషన్ల ఆహ్వానం
నవంబర్ 22, మహానది న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిది :భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మైనారిటీ యువతకు గ్రూప్-2 సర్వీసెస్ పరీక్షలకు సన్నద్ధం కావడానికి ఉచిత ఫుల్ లెంగ్త్ మాక్ టెస్టులు నిర్వహించబడనున్నాయి. ముస్లిములు, క్రిస్టియన్లు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పారసీయు మైనారిటీలకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించబోయే గ్రూప్-2 పరీక్షలకు ప్రిపరేషన్ మెరుగుపరచడమే ఈ మాక్ టెస్టుల ఉద్దేశ్యం. దరఖాస్తు చివరి తేదీ: 29 నవంబర్ 2024 ,మాక్ టెస్టు తేదీలు: డిసెంబర్ 2, 3, 9, మరియు 10 , పరీక్ష సమయం: ఉదయం 10:30 నుండి సాయంత్రం 4:30 వరకు ,ఈ మాక్ టెస్టులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గ్రూప్-2 పరీక్షకు అప్లై చేసిన మైనారిటీ యువతీ యువకుల కోసం ప్రత్యేకంగా నిర్వహించబడతాయి. ఆసక్తి గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, సంబంధిత దరఖాస్తులు సమర్పించగలరు. మరిన్ని వివరాలకు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి కార్యాలయము, కలెక్టర్ ఆఫీస్ గ్రౌండ్ ఫ్లోర్, రూమ్ నం. 6-12, నవభారత్ పాల్వంచను సంప్రదించవచ్చు.ఈ టెస్టులు అభ్యర్థుల విజయ సాధనకు దోహదపడే ఉద్దేశంతో రూపొందించబడ్డాయి. మైనారిటీ అభ్యర్థులు తప్పకుండా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ కోరుతోంది.