కార్తీక మాస వన సమారాధన మహోత్సవం ఘనంగా జరిగింది
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ఫారెస్ట్ సెంట్రల్ పార్క్‌లో నిర్వహించిన కార్తీక మాస వన సమారాధన మహోత్సవ కార్యక్రమం ఎంతో ఆహ్లాదకరంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు విచ్చేశారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం నిర్వహించబడింది. వేద పండితుల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రెడ్డి కుల సంఘాల నాయకులు మంత్రి మరియు ఎమ్మెల్యేలను సన్మానించారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రసంగం: కార్తీక మాసానికి ఉన్న పవిత్రతను, వన సమారాధన కార్యక్రమాల ద్వారా కుటుంబ సభ్యుల మధ్య సాన్నిహిత్యం పెరుగుతుందని పేర్కొన్నారు. ఈ తరహా సంస్కృతీ, సంప్రదాయాలను జాగృతం చేయడం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.
ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సందేశం: కార్తీక వన సమారాధన మహోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి శ్రీనివాస్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ వనభోజనాలు రెడ్డి కుటుంబ సభ్యులందరినీ ఒక కుటుంబ సభ్యులుగా కలిపి ఉంచడం చాలా సంతోషకరమని వ్యాఖ్యానించారు. ప్రతి ఏడాది ఈ కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రెడ్డి కుల సంఘ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకులు, మరియు రెడ్డి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వేడుకలు సాంస్కృతిక కార్యక్రమాలతో ముగిశాయి.